YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మురిగిపోతున్న గ్యాస్ సబ్సిడీ

మురిగిపోతున్న గ్యాస్ సబ్సిడీ

వంట గ్యాస్ వినియోగదారుల్లో కొందరికి సబ్సిడీ అందని ద్రాక్షగానే మారింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నా సబ్సిడీ కొందరి ఖాతాల్లో జమ కావటం లేదు. ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలకు చెబితే సంబంధంలేని  సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పైగా ముంబై వెళ్లి హెడ్డాఫీసులో కలవాలని పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ఇదే విషయమై పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదిస్తే.. సబ్సిడీ విషయాన్ని ఏజెన్సీనే అడగాలని సమాధానమిస్తూ తప్పించుకుంటున్నారు. మొత్తం మీద వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే సగటున ఒక్కోజిల్లాలో దాదాపుగా 5 లక్షల నుంచి 10 లక్షల మేర గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 25 శాతం నుంచి 40 శాతం మందికి రాయితీ జమకాకపోకపోవటంతో వారు ఇబ్బందులు పడ్తున్నారు. నెలకు దాదాపుగా రూ. 4 నుంచి 10 కోట్ల మేర ఒక్కో జిల్లాల్లో జమ కావటం లేదు. ఇలా ఏటా రాష్ట్ర వ్యాప్తంగా రూ. వందల కోట్లలో జమ కావట్లేదని  తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎక్కువగా హెచ్‌పీ, ఇండేన్, భారత్ గ్యాస్ చమురు కంపనీ ఏజెన్సీలున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఖాతాలకు రాయితీని అనుసంధానిస్తున్నా ఖాతాల్లో సబ్సిడీ జమ కాకపోవటంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతు న్నారు. గ్యాస్ ఏజెన్సీలు, సేల్స్ ఆఫీసర్లు, పౌరసరఫరాల అధికారులు ఈ విషయంలో ఫిర్యాదులు వస్తున్నా పెద్దగా స్పందించటం లేదనే ఆరోపణలున్నాయి. ఆధార్ అనుసంధా నం కాలేదని, మీకు రెండు మూడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయంటూ ఏవో కుంటి సాకులు చెప్తూ ఏజెన్సీ ప్రతినిధులు తప్పించుకుం టున్నాయని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సబ్సిడీ బ్యాంకుల్లో వారి వారి ఖాతాల్లో హోల్డ్‌లో ఉంటుందని కొన్ని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.2015కు ముందు గ్యాస్ ధర తక్కువగా ఉండగా ధరను పెంచిన చమురు కంపెనీలు రాయితీ విధానాన్ని ప్రవేశపెట్టాయి. గ్యాస్ బుక్ చేసిన తర్వాత డెలివరీ అయిన అనంతరం రాయితీ నగదు వినియోగదారుల ఖాతాలో జమకావాల్సి ఉంది. ఏడాది పాటు రాయితీ నగదు జమ కాగా, 2016 సెప్టెంబర్ నుంచి సమస్య మొదలైంది. గ్యాస్ డెలివరీ అయిన వారం రోజుల్లో రాయితీ జమయ్యేది. బుక్ చేసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొ నడంతో ఆందోళనకు గురవడం వినియోగదారుల వంతవుతోంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌పై అడపాదడపా ధరల భారం మోపుతుండగా రాయితీపై స్పష్టమైన పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాయితీ విధానం అమలు కాకముందు రూ.400 గ్యాస్ బండ ధర ఉండగా సదరు విధానం అమలు నుంచి ధరలు పెరగడమే తప్పా తగ్గిన దాఖలాలు తక్కువ. గ్యాస్ అవసర దృష్ట్యా వినియోగదారులు సబ్సిడీ అదే జమ అవుతుందిలే అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

Related Posts