అమరావతి
గంజాయి స్మగ్లింగ్ ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న పట్టించుకోవడం లేదు. గంజాయి స్మగ్లింగ్ గురించి మాట్లాడితే ..మా నాయకులు మీద కేసులు పెట్టారు, మా పార్టీ ఆఫీస్ ల మీద దాడులు చేశారని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. జగన్ ప్రభుత్వం గంజాయిని ఆదాయ వనరుగా చూస్తుంది. గంజాయికి కేరాఫ్ అడ్రస్ ఏపీ అని కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా చెప్పారు. ఏపీ నుండే గంజాయి దేశ వ్యాప్తంగా వెళుతుందని లోక్ సభలో హోం శాఖ మంత్రి చెప్పారు. సీఎం నివాసం ఉండే తాడేపల్లిలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని అయన అన్నారు.