న్యూఢిల్లీ, డిసెంబర్ 2
లోక్‌సభలో రఘురామ వర్సెస్ ఎంపీ భరత్ మధ్య వార్ నడిచిన సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణరాజు ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఉల్లంఘిస్తోందని.. రాష్ట్రం దివాలా తీయకుండా చూడాలని ప్రధానిని కోరారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి ఇప్పటికే ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల రుణాలు తీసుకుందని.. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని FRBM పరిమితులకు మించి రుణాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రఘురామకు ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. రఘురామ ఆరోపణల్లో నిజం లేదన్నారు. నిధుల సేకరణలో కేంద్రానికి చెప్పే ముందుకు వెళ్తున్నామన్నారు.ఈ క్రమంలో ఎంపీ భరత్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోపై వైసీపీ, టీడీపీల మధ్య వార్ నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దగ్గర జీతాలు కూడా ఇచ్చేందుకు డబ్బులు లేవంటూ భరత్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఎద్దేవా చేస్తున్నారు. పార్లమెంటులో ముఖ్యమంత్రి పరువు తీశారంటూ ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నారు. భారతదేశంలోని నెంబర్ 1 సీఎం, నెంబర్ 2 రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని సెటైర్లు పేల్చారు.టీడీపీకి వైసీపీ కూడా కౌంటర్ ఇస్తోంది. పార్లమెంట్లో చంద్రబాబులా చేయకండి సార్ అంటూ ప్రధాని నరేంద్రమోదీ విధానాలను ఎండగట్టారంటూ ఆ పార్టీ సానుభూతిపరులు వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని.. భరత్ కౌంటర్ ఇచ్చారని చెబుతున్నారు. నిధుల సేకరణలో కేంద్రానికి చెప్పే ముందుకు వెళ్తున్నామని భరత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.