YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

వాయువేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి

వాయువేగంతో ఒమిక్రాన్  వ్యాప్తి

ముంబై డిసెంబర్ 2
దాదాపు నెల రోజుల కిందట దక్షిణాఫ్రికా గుర్తించిన కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వాయువేగంతో వ్యాప్తిచెందుతోంది. ఈ వేరియంట్ భయంతో పలు దేశాలు తమ సరిహద్దులను మూసివేశాయి. ఇక, ఒమిక్రాన్ విజృంభిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను అందజేయాలని విమానయాన సంస్థలను అమెరికా యంత్రాంగం ఆదేశించింది. ప్రస్తుతం కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ 24 దేశాలకు వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ప్రకటించింది.గతంలో వ్యాప్తిచెందిన డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోల్చిే ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వేరియంట్ భయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిపోతుండగా.. ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆంక్షలు మహమ్మారి ఆర్థిక సంక్షోభం తాత్కాలిక పునరుద్ధరణను ఉక్కిరిబిక్కిరి చేయగలవని భయపడుతున్నారు.రోగనిరోధకతను సైతం ఒమిక్రాన్ తప్పించుకుంటోందని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ) వెల్లడించింది. అయితే, మరణాల ముప్పు, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో టీకాలు కొంత వరకూ సహకరిస్తాయని పేర్కొంది. గత నెలలో జన్యువిశ్లేషణ చేసిన అన్ని నమూనాలలో 74% కొత్త వేరియంట్‌వేనని ప్రకటించింది. దక్షిణాఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన గౌటెంగ్ ప్రావిన్సుల్లో నవంబర్ 8న సేకరించిన నమూనాలో తొలిసారి గుర్తించారు.మరోవైపు, దక్షిణాఫ్రికాలో కొత్త కేసులు మంగళవారం నుంచి బుధవారానికి రెట్టింపయ్యాయి. మంగళవారం 4,373 కేసులు నమోదుకాగా.. బుధవారం ఆ సంఖ్య 8,561గా నమోదయినట్టు ఎన్ఐసీడీ తెలిపింది. ఒమిక్రాన్ ఎలా వ్యాప్తిచెందుతుందనే సమాచారాన్ని మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఎపిడిమియాలజిస్ట్ మారియా వన్ కెర్ఖోవ్ అన్నారు.ఒమిక్రాన్‌ను సమర్ధంగా అడ్డుకునే వ్యాక్సిన్ ఫైజర్‌తో కలిసి తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు బయోఎన్‌టెక్ సీఈఓ తెలిపారు. కొత్త వేరియంట్‌ ఎంత సులభంగా వ్యాపించగలదో, టీకా రక్షణ నుంచి తప్పించుకోగలదో లేదో నిర్ధారించాలని ఐరోపా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షుడు అన్నారు. ఐరోపాలో ఐదు నుంచి పదకొండేళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ డిసెంబరు 13 నుంచి ప్రారంభించడానికి ఈయూ అనుమతించింది

Related Posts