YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కష్టాల్లో మళ్లీ కాలా

కష్టాల్లో మళ్లీ కాలా

కొద్ది రోజులుగా త‌మిళ తంబీలు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాల క‌న్నా ఆయ‌న రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌ట‌న కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. ‘కాలా’ రాజకీయ నేపథ్య చిత్రం కాదని.. కాకపోతే సినిమాలో రాజకీయాలు ఉంటాయని సూపర్‌స్టార్ రజినీకాంత్ చెప్పారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘కాలా’. రజినీతో ‘కబాలి’ చిత్రాన్ని తెరకెక్కించిన పా.రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. రజినీ అల్లుడు ధనుష్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఆడియో లాంచ్ ఫంక్షన్‌లా లేదని, ఫిల్మ్ సక్సెస్ మీట్‌లా ఉందని అన్నారు. కాని నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి రోజులు వస్తాయి అంటూ ర‌జ‌నీ త‌న పార్టీ ప్ర‌క‌ట‌న విష‌యాన్ని మ‌ళ్ళీ స‌స్పెన్స్‌లో పెట్టారు. అయితే గ‌త ఏడాది 234 స్థానాల్లో త‌న‌ పార్టీ అభ్యర్థులను బ‌రిలో దింప‌నున్నట్టు త‌లైవా ప్ర‌క‌టించ‌డంతో ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లో రావ‌డం ప‌క్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో ర‌జ‌నీ త‌న పార్టీ , ఎజెండా వివ‌రాలు ఎప్పుడు తెలియ‌జేస్తాడా అని అంద‌రు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ‘రజినీకాంత్ మక్కల్ మంద్రమ్’ అనే పేరుని ర‌జనీ త‌న పార్టీకి పెట్ట‌నున్నాడ‌ని త‌మిళనాట జ‌రుగుతున్నా దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఇక కాలా ఆడియో వేడ‌క‌లో మాట్లాడుతూ.. నాలుగు ద‌శాబ్ధాలుగా నా పని అయిపోయింద‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. త‌మిళ నాడు ప్ర‌జలు, ఆ దేవుడు నన్ను ముందుకు వెళ్ళేలా చేస్తున్నారు. ఎవ‌రెన్ని త‌ప్పుడు మాట‌ల‌ మాట్లాడినా, నన్ను విమ‌ర్శించిన నా మార్గంలో నేను వెళుతుంటాను. ద‌క్షిణాదిన న‌దుల అనుసంధానం నా క‌ల‌. చెడు ఆలోచ‌న‌లు తొల‌గించండి, అప్పుడే జీవితం బాగుంటుంది అని తలైవా పేర్కొన్నారు. ర‌జ‌నీ నటించిన కాలా జూన్ 7న విడుద‌ల కానుంది.

Related Posts