విజయవాడ, డిసెంబర్ 3,
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి కరెక్ట్‌గా రెండున్నర ఏళ్ళు అవుతుంది. మరి ఈ రెండున్నర ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? అంటే వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు ప్లస్ టీడీపీ-జనసేన నుంచి వచ్చిన ఐదుగురుని కలుపుకుని మొత్తం 156 మంది ఎమ్మెల్యేలని మూడు భాగాలుగా చేసుకుంటే..అందులో ఒక వంతు ఎమ్మెల్యేల పనితీరు చాలా దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇంకో వంతు ఎమ్మెల్యేల పనితీరు పర్లేదు అనిపించేలా, ఇంకా మూడవ వంతు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని చెప్పొచ్చు.అంటే మొత్తం మీద చూస్తే సగం మంది ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రమే ఉందని చెప్పొచ్చు. ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో కూడా దాదాపు 60 మంది పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది. రెండున్నర ఏళ్లకే ఈ పరిస్తితి ఉంటే..మరి నెక్స్ట్ ఎన్నికల సమయానికి పరిస్తితి ఎలా ఉంటుందంటే? ఊహించడం కాస్త కష్టమే అని చెప్పొచ్చు.ఎక్కువ మందిపై నెగిటివ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్ బేస్ చేసుకుని ఎన్నికలకు వెళితే మాత్రం ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేలు సేఫ్ సైడ్‌గా ఉండాలంటే జగన్ బొమ్మే శ్రీరామరక్ష అని చెప్పొచ్చు. గత ఎన్నికల్లోనే చాలామంది ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ మీద బేస్ అయ్యి విజయం సాధించారు. దాదాపు 100 పైనే నియోజకవర్గాల్లో జనం స్థానికంగా ఎమ్మెల్యేలని చూసి కంటే జగన్ బొమ్మ చూసే వైసీపీకి ఓటు వేశారని చెప్పొచ్చు.ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్తితి రిపీట్ అయ్యేలా ఉంది. పైగా ఇప్పుడు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో జగన్ ఇమేజ్ మాత్రమే వైసీపీని కాపాడగలదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆయన ఇమేజ్ బేస్ చేసుకునే ఎమ్మెల్యేలు గెలవాల్సిన పరిస్తితి ఉంది. జగన్ బొమ్మతోనే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి రావాల్సి ఉంటుంది.