తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి బయోపిక్‌గా ప్రేక్షకుల మందుకొచ్చిన ‘మహానటి’ మూవీపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ బుధవారం నాడు థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కామన్ ఆడియన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ‘మహానటి’ అద్భుతం అంటూ తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో తెలియజేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి ‘మహానటి’ చిత్రాన్ని తొలి రోజునే వీక్షించి చిత్ర యూనిట్‌ను ఆకాశానికెత్తేశారు. తాను చూసిన అద్భుతమైన పెర్ఫామెన్స్ లలో కీర్తి సురేష్ నటన ఒకటని ఆయన కొనియాడారు. కీర్తి సురేష్ సావిత్రిని ఇమిటేట్ చేయలేదని, స్వయంగా సావిత్రినే మన కళ్ల ముందుకు తీసుకొచ్చిందని ప్రశంసలు కురిపించారు. ఇక ఈ చిత్రంలో జెమినీ గణేశన్‌గా నటించిన దుల్క సల్మాన్ ఆ పాత్రలో జీవించారని.. ఇక నుంచి తాను అతడికి ఫ్యాన్‌ని అయిపోయానని జక్కన్న ట్వీట్ చేశారు. మరోవైపు టాలీవుడ్‌కి చెందిన మంచు మనోజ్, బ్రహ్మాజీ, లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి తదితరులు ‘మహానటి మహా అనుభూతి’ని ఇచ్చిందంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు.
అభినవ నేత్రి మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కిన మహానటి చిత్రంపై తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. మహానటి చిత్రం చాలా అద్భుతంగా ఉందని అన్నారు. నిజంగా ఈ చిత్రం ఎంతగానో అలరించింది. సావిత్రి పాత్రకి కీర్తి సురేష్ జీవం పోసింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్నలకు తన అభినందనలు తెలిపారు. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాగచైతన్యల నటన అద్భుతంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్ ద్వారా కొనియాడారు. మహానటి చిత్రంపై ఇప్పటికే రాజమౌళి, రాఘవేంద్రరావు, అట్లీ, సుశాంత్, మోహన్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దాదాపు 18 నెలల పాటు చిత్రీకరణ జరుపుకున్న మహానటికి ఇంత భారీ రెస్పాన్స్ రావడంతో అశ్వినీదత్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు. సరిగ్గా మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం వైజయంతి బ్యానర్‌లోనే విడుదలై సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పుడు మహానటి కూడా భారీ రికార్డులు తిరగరాసే దిశగా దూసుకెళుతుంది. చిత్రంలో సావిత్రి పాత్రని కీర్తి సురేష్ పోషించగా, జెమినీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్ నటించారు.