వికారాబాద్
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ ,సయ్యద్ పల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలంటు షాద్ నగర్ పరిగి రహదారి పై బైటాయించి నిరసన తెలిపారు విద్యార్థులు. ప్రతి రోజు పాఠశాలలకు, కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నామని పలుమార్లు పరిగి బస్సు డిపో మేనేజర్ కు పిర్యాదు చేసిన ఇప్పటివరకు బస్సు సౌకర్యం కల్పించలేదంటు వాపోయారు విద్యార్థులు. జూన్ లో విద్య సంస్థలు ప్రారంభం అయ్యాయి ఇప్పటి వరకు బస్సు సౌకర్యం కల్పించలేదని ప్రతిరోజు తమ గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల మేరా నడుచుకుంటూ వస్తువెళ్తున్నామని తెలిపారు. కొందరు విద్యార్థులు ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు