విశాఖపట్నం
ఆగ్నేయ బంగాళాఖాతం లో వాయు గుండం విశాఖ దక్షిణ ఆగ్నే యంగా కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖా తంలో ప్రవే శిస్తూ తుఫాన్ గా మారను న్న వాయు గుండం ... శనివారం ఉత్తర కోస్తా దక్షిణ ఒడి శా వద్ద తుఫాను తీరం తాకే అవకాశం ఉంది. ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాల కు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారుల హెచ్చరికల నేపథ్యం లో అధికారులు పునరావాస కేంద్రా లను ఏర్పాటు చేశారు.
తుఫాన్ ను సమర్ధవంతం గా ఎదుర్కొ నేందుకు విశాఖ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధ మవుతోంది. ఇప్పటికే విశాఖకు 50 మంది ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది చేరు కున్నారు. నేవీ... కోస్ట్గార్డ్... ఎన్డీఆర్ఎ ఫ్ బలగాల ను కూడా అప్రమత్తం చేశారు.ఈరోజు రేపు విశాఖలో పర్యా టక ప్రదేశాల్లో సందర్శకులకు అనుమ తి నిరాకరిం చారు.తుఫాను నేపథ్యం లో ఈ రోజు రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలకు రేపు సెలవును అధికా రులు ప్రకటించారు.మరోవైపు ఈ సాయంత్రం నుంచి గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకా శం ఉందని మత్స్యకారులు రెండు రోజులపాటు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.