నారాయణఖేడ్
ట్రైనింగ్ లో వున్న నర్సును లైంగికంగా వేధించిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులిచ్చారు. గురువారం నాడు ట్రైనీ నర్సింగ్ విద్యార్థినితో డాక్టర్ నర్సింగ్ చౌహాన్ అసభ్యంగా ప్రవర్తించడం, బాధితురాలి బంధువులు వచ్చి డాక్టర్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించడం తెలిసిందే. ఘటన అంతా మీడియాలో ప్రసారం అయింది. దాంతో ఉన్నతాధికారులు చర్యలు చెపట్టారు. సంగారెడ్డి జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ కు నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పూర్తి వివరాలు సేకరించి సమర్పించాలని ఆదేశించారు. డాక్టర్ రామకృష్ణ రాజుకు ఇన్ చార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు అప్పగించారు.