విశాఖపట్నం
కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలను ఈ ఏడాది రద్దు చేసినట్లు నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా ప్రకటించారు.ఎక్కువ క్రౌడింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.వాతావరణం అనుకూలిస్తే సముద్ర తీరంలో నౌకల ద్వారా ప్రదర్శిస్తామని చెప్పారు.తూర్పు నావికా దళ ఆధ్వర్యంలో రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2022 ఫిబ్రవరి 21 న ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ, 25వ తేదీన మిలాన్ 2022 కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా మూడో సారి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వరదలు తుఫాన్ల సమయంలో సహాయక చర్యల్లో నేవీ ముందుంటుందని చెప్పారు.కోస్టల్ సెక్యూరిటీ చాల కీలకమైందన్నారు. కోస్ట్ గార్డు నేవీ నిరంతరం నిఘా చేస్తూనేవుందని పేర్కొన్నారు. ఇందులో 47 దేశాలు పాల్గొంటాయని తెలిపారు. చైనా, పాకిస్థాన్ లను ఆహ్వానించండం లేదని వెల్లడించారు.