అమరావతి డిసెంబర్ 3
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారి భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ, విపత్తు శాఖల హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తుగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. విశాఖలోనో కలెక్టరేట్‌లో ప్రజలకు అందుబాటులో అత్యవసర సేవలకు గాను కంట్రోల్ రూం నెంబర్లను ప్రకటించింది. 08912590100, 08912590102, 08912750089, 0891 2750090, 08912560820లకు ఫొన్ చేయాలని బాధితులకు సూచించింది.కాగా తాజా సమాచారం మేరకు జవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 420 కి. మీ దూరంలో, ఒడిశా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ, పారాదీప్‌కు 650 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గంటకు 25 కి.మీ వేగంతో ఉత్తర కోస్తాంధ్ర వైపు జవాద్ తుఫాన్ దూసుకొస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉత్తర కోస్తాంధ్ర ఒడిశా తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది.