YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పంజాబ్ కాంగ్రెస్ లో చేరిన సిద్ధూఁ

పంజాబ్ కాంగ్రెస్ లో చేరిన సిద్ధూఁ

పంజాబ్ కాంగ్రెస్ లో చేరిన సిద్ధూఁ
ఛండీఘడ్, డిసెంబర్ 3,
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చుతూ ప్రముఖ పంజాబీ గాయ‌కుడు సిద్ధూ మూసీవాలా(Sidhu Moose Wala) శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబీ యువకుల మధ్య మూసీవాలాకు మంచి క్రేజ్ ఉంది. పంజాబ్ ముఖ్యమంత్రి చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ స‌మ‌క్షంలో మూసీవాలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మూసీవాలా యూత్ ఐకన్.. అంతర్జాతీయ సెలబ్రిటీగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. కాంగ్రెస్ కుటుంబంలో చేరాలన్న ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మూసీవాలా అతికష్టంతో కళాకారుడిగా ఎదిగారని.. తన పాటలతో లక్షలాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారని సీఎం చన్నీ కొనియాడారు.
ఈ సంద‌ర్భంగా సింగ‌ర్ సిద్ధూ మూసీవాలా మాట్లాడుతూ.. పంజాబీల గ‌ళం దేశ‌మంత‌టా వినిపించ‌డానికే తాను కాంగ్రెస్‌లో చేరాన‌ని చెప్పారు.సిద్ధూ మూసీవాలా గతంలో కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. తన పాటలతో హింస, గన్ కల్చర్‌ను మూసీవాల ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆ మేరకు ఆయనపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. మూసీవాల అసలుపేరు సుభ్‌దీప్ సింగ్ సిద్ధు. మన్సా జిల్లాలోని మూసా గ్రామం ఆయన స్వస్థలం. మూసీవాలా తల్లి ఆ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. పంజాబ్‌ అసెంబ్లీకి వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

Related Posts