YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ్రిటన్ కోర్టులో మాల్యాకు దెబ్బ

బ్రిటన్ కోర్టులో మాల్యాకు దెబ్బ

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో గట్టి ఎదరు దెబ్బ తగిలింది. 1.55 బిలియన్ డాలర్ల వ్యాజ్యంలో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుతో భారతీయ బ్యాంకులు ఆయనకు ఇచ్చిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు అవకాశం కల్పించింది. మాల్యాకు రుణాలు ఇచ్చిన ఇండియన్ బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ దాఖలు చేసింది. జడ్జి ఆండ్రూస్ హెన్షా ఈ తీర్పును ఇచ్చారు. మాల్యా ఉద్దేశ్యపూర్వకంగా రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారని పేర్కొన్నారు. ఆయనపై 13 బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశాయి. 13 బ్యాంకుల‌కు అనుకూలంగా భార‌త కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను జ‌డ్జి స‌మ‌ర్థించారు. 17 భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి 2016 మార్చి 2న మాల్యా దేశం విడిచి లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. మాల్యా అప్పగింతకు ఎడతెగని పోరాటం చేస్తోంది. గతేడాది ఏప్రిల్ 18న అరస్టైన 

యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ప్రమోటర్ సంస్థలకు చెందిన మరో 4.13 కోట్లకుపైగా షేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఈ మేరకు మంగళవారం యూబీఎల్ స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. ఈ షేర్లు 15.63 శాతంతో సమానమన్న యూబీఎల్.. తాజా స్వాధీనంతో కంపెనీలో ఈడీ వద్దనున్న షేర్లు 16.15 శాతానికి చేరుకున్నాయని వివరించింది. మొత్తం 8 ప్రమోటర్ కంపెనీల షేర్లివి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణ ఎగవేత కేసులో ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ షేర్ల జప్తు జరుగుతున్నది. సెబీ ఆదేశంతో విజయ్ మాల్యాను గతేడాది డైరెక్టర్ హోదా నుంచి యూబీఎల్ తప్పించింది. కాగా, మాల్యాకు చెందిన ఆస్తుల్ని జప్తు చేయాలంటూ ఢిల్లీలోని ఓ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇంగ్లండ్ వేల్స్‌లో మాల్యాకు ఉన్న ఆస్తుల‌నుస్వాధీనం చేసుకునేందుకు మ‌న దేశ బ్యాంకుల‌కు వీలు ద‌క్కింది. క‌ర్ణాట‌క‌కు చెందిన డెట్ రిక‌వ‌రీ ట్రైబ్యున‌ల్ బ్యాంకుల‌కు మాల్యా రూ.62,033,503,879ను వ‌డ్డీతో స‌హా చెల్లించాల‌ని ఇదివ‌ర‌కే కోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Related Posts