YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం వైపు జావోద్

విజయనగరం వైపు జావోద్

విజయనగరం వైపు జావోద్
విజయనగరం, డిసెంబర్ 3,
జెట్‌ స్పీడ్‌తో జొవాద్ వచ్చేస్తోంది. సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖ తీరానికి ఇంకా కేవలం 480 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. ప్రస్తుతం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో జొవాద్‌ దూసుకువస్తోంది. మరో ఆరు గంటల్లో మరింత వేగం పుంజుకుని ఉత్తరాంధ్రతోపాటు ఒడిషాపై దాడి చేయనుంది. జొవాద్‌ ఎఫెక్ట్‌తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలతో సముద్రం భీతిగొలుపుతోంది. తీరం వెంబడి గంటకు వంద కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తున్నాయ్. జొవాద్‌ విధ్వంసం ఏ స్థాయిలో ఉండనుందో ఊహించడం కూడా కష్టమే. ఊహకందని విధంగా విధ్వంసం ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఉత్తరాంధ్రలో మినిమం 7 సెంటీమీటర్ల నుంచి మాగ్జిమమ్‌ 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ చెబుతోంది. ఐఎండీ వార్నింగ్‌ను చూస్తుంటే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రమాదం జరిగేలా కనిపిస్తోంది.జొవాద్ ఎఫెక్ట్‌తో స్టేట్‌వైడ్‌గా ఏపీ హైఅలర్ట్ ప్రకటించింది. రాష్ట్రమంతటా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జొవాద్ ఎఫెక్ట్ అధికంగా ఉండే ఉత్తరాంధ్రలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఈరోజు, రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విశాఖలో అన్ని పర్యాటక ప్రాంతాలు మూసివేశారు. జొవాద్‌ తుఫాన్‌పై ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్‌తోపాటు నేవీ హెలికాప్టర్లు, కోస్ట్‌గార్డ్‌, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ టీమ్స్‌ రెడీగా ఉండాలని సూచించారు. జొవాద్ ఎఫెక్ట్‌తో దక్షిణమధ్యరైల్వే పలు రైళ్లను రద్దుచేసింది. సుమారు 40 రైళ్లను ఈరోజు, రేపు క్యాన్సిల్ చేసింది.ఉత్తరాంధ్రపై విరుచుకుపడేందుకు దూసుకొస్తున్న జొవాద్ మామూలు తుఫాన్ కాదు. పెను తుఫాను. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు. మన ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించే అవకాశముంది.కాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాపై తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.  అన్ని మండ‌లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఈ నంబర్లను జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి.

Related Posts