YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఊపిరిపోసిన అఖండ

ఊపిరిపోసిన అఖండ

 ఊపిరిపోసిన అఖండ
హైదరాబాద్, డిసెంబర్ 3,
బాలయ్య దుమ్ములేపుతున్నాడు. అఘోరాగా అదరగొడుతున్నాడు. అఖండగా బాక్సాఫీస్ లెక్కలు తేలుస్తున్నాడు. యస్.. బాలయ్య థియేటర్ల వద్ద సింహ గర్జన చేస్తున్నారు. కలెక్షన్ల ఊచకోత మొదలెట్టాడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడని కాలర్ ఎగరేస్తున్నారు. బొయపాటి మార్క్ ఎలివేషన్స్‌ను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడా ఫైట్స్ కొంచెం ఓవర్ అయ్యాయన్న మాటలు వినిపిస్తున్నా.. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటున్నారు ఫ్యాన్స్. క్రాక్ తర్వాత టాలీవుడ్‌లో  ఆ రేంజ్ మాస్ సినిమా రాలేదు. తాజాగా బాలయ్య మరోసారి అన్ని లెక్కలు తేల్చేశాడు. తెలుగు సినిమాకు ఊపిరి పోశాడు. ఓవరాల్‌గా మౌత్ టాక్ బాగుందని రావడంతో.. జనాలు సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఊహించని విధంగా చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. ఈ బోర్డ్స్ తెలుగు రాష్ట్రాల్లో కనబడి చాలా రోజులైందనే చెప్పాలి. మొత్తంగా డిసెంబర్ 2న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మాస్ జాతర నడిచింది. దీంతో ఊహించిన దానికంటే కలెక్షన్లు కాస్త ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. టోటల్‌గా ఈ మూవీకి 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి…
నైజాం- 4.39 కోట్లు
సీడెడ్- 4.02 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు
ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు
వెస్ట్ గోదావరి- 96 లక్షలు
గుంటూరు- 1.87 కోట్లు
కృష్ణా- 81 లక్షలు
నెల్లూరు- 93 లక్షలు
అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. హిట్ టాక్‌తో పాటు మరో సినిమా పోటీలో లేదు. వీకెండ్ హాలిడేస్ కూడా ఉండనే ఉన్నాయి. దీంతో ఈ వారంతం ముగిసేసరికి బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
===================
103 సంగారెడ్డి జిల్లాలో విషాదం
మెదక్, డిసెంబర్ 3, (న్యూస్ పల్స్)
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూమిగ్‌ కాలనీలో నివాసం ఉంటున్న 40 ఏళ్ల చంద్రకాంత్ రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తున్నారు. ఆయనకు భార్య లావణ్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల అతనికి వ్యాపారంలో బాగా నష్టాలు వచ్చాయి. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై ఆలుమగల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరి పిల్లలను తీసుకుని లావణ్య ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది.భార్య పిల్లలతో బయటకు వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన చంద్రకాంత్‌ నిన్న ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త మరణవార్తను తెలుసుకున్న లావణ్య తన ఇద్దరు పిల్లలతో సహా ఆందోళ్‌ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. కాగా లావణ్య తన ఇద్దరు పిల్లలు తప్పిపోయినట్లు గురువారం సాయంత్రం వారి బంధువులు రామంచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

Related Posts