ఇలా కూర్చోవచ్చా ? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం కాదా ?
బావా ... బామ్మర్దులు ఆడుకోవటానికి ఇదేమన్నా కూచీలాటా ?
బామ్మర్ది కళ్ళల్లో ఆనందం కోసం కుర్చీ అప్పగించిన బావ.ముఖ్యమంత్రి కార్యాలయం సాక్షిగా అపహాస్యం అయిన ప్రజాస్వామ్యం
నిజమే విజయవాడలోని సీఎం విడిది కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుర్చీలో కూర్చున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..
గతంలో బావ కళ్ళలో ఆనందం కోసం ఒకరు అరాచకం సృష్టిస్తే ...ఇప్పుడు బామ్మర్ది సంతోషం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.
నాటి బావా బామ్మర్దులు ఎక్కడ ఉన్నారో కానీ..నేటి బావా బామ్మర్దులు మాత్ర0 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఒకరు శాసనసభ్యులుగా మరొకరు పదవులలో ఉన్నారు.
ఇంక అసలు విషయం ఏమిటంటే ఈ రోజు హిందూపురం నియోజకవర్గానికి సంభ0దించిన సమీక్షా సమావేశం MLA బాలకృష్ణ గారు నిర్వహించారు ... అదీ ఎక్కడా ... .ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ... అదీ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పుడు .
సరే అంతవరకు సహించినా ... ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సమీక్ష నిర్వహించటమే తప్పు అయితే ఆ శాసనసభ్యుడైన బాలకృష్ణ గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చోని సమీక్ష నిర్వహించటం ... అందులో మంత్రి దేవినేని ఉమ గారితో పాటు మనసు చంపుకొని సీనియర్ IAS అధికారులు పాల్గొనటం అత్యంత అప్రజాస్వామిక0...
సీఎం కావాలన్న కోరిక ఎప్పటినుంచో బాలకృష్ణ గారికి ఉందన్న విషయం బాబు గారితో పాటు అందరికీ తెలిసిందే !
అయినంత మాత్రాన ఆయన కోరిక తీర్చటానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా ? మీకు బామ్మర్ది మీద అంత ప్రేమ ఉంటే నిజంగా ... ప్రజాస్వామ్య బద్ధంగా సీఎం ని చేయండి ... మీకు ఆ బలం ఉందిగా !
(((ఏమీ లెనోన్నే మంత్రిని చేసి ప్రజల నెత్తిన పెట్టిన మీకు ... మీరు అలాంటిది సొంత బామ్మర్ది ... స్వయంగా వియ్యంకుడు ... ఒక మహా పురుషుడి పుత్రరత్న0 అయిన బాలకృష్ణ గారిని సీఎం చేయటం మీకో లెక్కా ? )))
2014 లో అనుభవం ఉందన్న ఒకే కారణంతో ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారే కానీ మీరూ , మీ కుటుంబ సభ్యుల అధికార పీఠ కోరికలు తీర్చుకొని మురిసిపోవటానికి కాదు!
అసలే ఒకవైపు మాఫియా మాయగాళ్ళు సహజ వనరులు దోచుకుంటున్నారు. కల్తీ గాళ్ళు ప్రజల ఆరోగ్యంతో చెడుగుడు ఆడుతున్నారు ... ఈ దుర్మార్గాల్లో సాక్షాత్తు మీ మంత్రులు ,శాసనసభ్యుల పాత్ర ఉందన్న విమర్శలు వస్తున్నా మీకు చీమకుట్టినట్లు కూడా లేకపోవటం సిగ్గుచేటు.
మరోవైపు ప్రత్యేక హోదా లేదు ... ప్రత్యేక ప్యాకేజి లేదు ... అయినా ఇవ్వేమి పట్టించుకోరు ... కనీసం అడగరు ... కేంద్రం ముందు మొకరిల్లి బయటికి వచ్చి కోర్టు కి వెళ్తాను అంటూ పిల్లి గాండ్రి0పులు ...
ప్రజలూ ... రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు మీకూ మీ కుటుంబ సభ్యులకు , మీ వాళ్ళకి ముఖ్యమంత్రి కుర్చీ కావాలి.
ఇంత దుర్మార్గపు పాలన ప్రపంచంలో ఎక్కడా లేదు.ఈ బావా బామ్మర్దులు ఎవరి కళ్లల్లో ఏమి చూసుకున్నారో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను ... పరిపాలనను బ్రష్టుపట్టిస్తున్నారు ... ఇంకో 11 నెలలు తప్పదు .ప్రజాస్వామ్య వాదులారా ఈ దురాగతాలు అప్పటివరకు భరించవలసిందే తప్పదు.