విజయవాడ సిద్ధర్థ్ కాలేజీ లో మూడు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి ఇప్పటి నుంచే పనులు మొదలుపెట్టారు. సిద్దార్థ్ కాలేజీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు భూమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి జరిగే మహానాడు కి అత్యంత ప్రాధాన్యత ఉంది, ధర్మపోరాట దీక్షతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం ఫై పోరాడుతున్నం. మహానాడు లో అన్ని అంశాల ఫై దిశా నిర్దేశం చేస్తామని అయన అన్నారు.