YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల‌ను ఉత్ప‌త్తి చేసేంద‌కు ప్ర‌భుత్వం ఆమోదం

ఏకే-203 అసాల్ట్ రైఫిళ్ల‌ను ఉత్ప‌త్తి చేసేంద‌కు ప్ర‌భుత్వం ఆమోదం

న్యూఢిల్లీ డిసెంబర్ 4
ర‌క్ష‌ణ‌రంగ ఉత్ప‌త్తుల త‌యారీలో భార‌త్‌ను స్వ‌యం స‌మృద్ధిగా తీర్చేందుకు ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. దీనిలో భాగంగా సుమారు అయిదు ల‌క్ష‌ల ఏకే-203 అజాల్ట్ రైఫిళ్ల‌ను ఉత్ప‌త్తి చేసేంద‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక‌ తుపాకుల‌ను త‌యారీ చేయ‌నున్నారు.7.62 X 39ఎంఎంక్యాలిబ‌ర్ క‌లిగిన ఏకే-203 రైఫిళ్లను.. ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో వాడ‌నున్నారు. ఇన్సాస్ రైఫిళ్ల‌ను ఇండియాలో గ‌త మూడు ద‌శాబ్ధాల నుంచి వాడుతున్నారు. ఏకే-203 సామ‌ర్థ్యం సుమారు 300 మీట‌ర్లు ఉంటుంది. ఈ తుపాకీ బ‌రువు చాలా తేలిక‌గా ఉంటుంది. చాలా సులువైన రీతిలో దీన్ని వాడ‌వ‌చ్చు. ఏకే-203 రైఫిల్‌లో ఉన్న టెక్నిక్ కూడా స‌ర‌ళ‌మైంద‌ని, పోరాటాల వేళ సైనికులు అత్యంత క‌చ్చిత‌త్వంతో ఈ రైఫిళ్ల‌ను వాడ‌వ‌చ్చు అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య కుదిరిన ప్ర‌త్యేక ఒప్పందం ప్ర‌కారం ఈ రైఫిళ్ల‌ను త‌యారీ చేయ‌నున్నారు. అడ్వాన్స్‌డ్ వెప‌న్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్‌, రోసోబోరాన్ ఎక్స్‌పోర్ట్‌, క‌ల‌ష్నికోవా మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం తుపాకీల త‌యారీ జ‌ర‌గ‌నున్న‌ది.

Related Posts