YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సమాచారం లేదని రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? కేంద్రాన్ని నిలదీసిన రాహుల్‌ గాంధి

సమాచారం లేదని రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ?  కేంద్రాన్ని నిలదీసిన రాహుల్‌ గాంధి

న్యూఢిల్లీ డిసెంబర్ 4
సాగుచట్టాల నిరసనోద్యమంలో అమరులైన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ కేంద్రం పేర్కొనడంపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడం ఇష్టంలేకే కేంద్రం ఇలాంటి అబద్ధాలు చెబుతున్నదని మండిపడ్డారు. సమాచారం లేదని చెప్పి ఆ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం మానేస్తారా? అని కేంద్రాన్ని నిలదీశారు. పారిశ్రామికవేత్తల పేర్ల జాబితా మోదీ వద్ద ఉంటుందని, రైతులు అమరులైతే వారి జాబితా ఉండదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రాహుల్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏడాదిపాటు కొనసాగిన పోరాటంలో 700 మందికిపైగా రైతులు చనిపోయారని గుర్తుచేశారు. పంజాబ్‌ ప్రభుత్వమే 403 మంది రైతుల్ని గుర్తించిందని, 100 మంది రైతుల జాబితా తమ పార్టీ వద్ద ఉన్నదని వెల్లడించారు. మరో 200 మంది జాబితా పబ్లిక్‌ రికార్డ్స్‌లో ఉన్నట్టు వివరించారు. తమ వద్ద ఉన్న పూర్తి జాబితాను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు వివరించారు.

Related Posts