YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మూడుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

మూడుకు చేరిన ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్, డిసెంబర్ 4,
భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదయ్యింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్‌ చేశారు. రెండు రోజుల క్రితమే ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి జామ్‌నగర్‌ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో శాంపిల్ప్‌ను పూణెలోని జీనోమ్‌ సీక్వెనింగ్‌కు పంపించారు. జీనోమ్‌ సీక్వెనింగ్‌లో ఆ వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్థారణ అయ్యిందని గుజరాత్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది.దీంతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే బెంగళూర్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి తిరిగి దుబాయ్‌ వెళ్లిపోయాడు.దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి ఇప్పటి వరకు ఎవరూ మరణించకపోవడం ఊరట కలిగించే అంశం. ఒమిక్రాన్ కట్టడి చర్యల్లో భాగంగా పలు దేశాలు విదేశీయుల రాకను నిషేధించాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

Related Posts