YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

అజాజ్ మాయాజాలం

అజాజ్ మాయాజాలం

ముంబై, డిసెంబర్ 4,
ముంబయి వేదికగా న్యూజిలాండ్‌, టీమిండియాల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ సంచలనం సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. ముంబై టెస్ట్‌లో తన స్పిన్‌ మాయాజాలంతో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. దీంతో అనిల్‌ కుంబ్లే 1999 ఫిబ్రవరి 7న పది వికెట్లు పడగొట్టిన రికార్డును అజాజ్‌ సమం చేశాడు. రెండో టెస్టు మ్యాచ్‌లో మొత్తం 47.5 బంతులు వేసిన అజాజ్‌ 119 పరుగులు, 12 మేడిన్‌ ఓవర్‌లతో 10 వికెట్లు తీసుకున్నాడు.దీంతో ఇంగ్లాండ్‌ బౌలర్‌ జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లేల రికార్డును సమం చేశాడు అజాజ్‌. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారి 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అంటే 1999లో అంటే పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.ఇప్పుడు మళ్లీ 22 ఏళ్ల తర్వాత అజాజ్‌ పటేల్‌ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఓ టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా కూడా అజాజ్‌ గుర్తింపు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే అజాజ్‌ పటేల్‌ మన భారతీయుడేనన్న విషయం మీకు తెలుసా.? ముంబయిలో జన్మించిన అజాజ్‌ తర్వాత న్యూజిలాండ్‌ వెళ్లి స్థిరపడ్డాడు.
యధావిధిగా సౌతాఫ్రికా టూర్
టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనను యాథవిధిగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోల్‌కతాలో నేడు జరిగిన బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్‌ వేరియంట్ నేపథ్యంలో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటనను కొనసాగించాలా? వద్దా? అని బీసీసీఐ మల్లగుల్లాలు పడింది. ఒకనొకదశలో పర్యటనను వాయిదా వేయాలని కూడా అనుకుంది. అయితే క్రికెటర్ల భద్రతకు దక్షిణాఫ్రికా బోర్డు హామీ ఇచ్చింది. క్రికెటర్ల కోసం పటిష్ఠమైన బయోబబుల్‌ సెక్యూరిటీని కల్పిస్తామని పేర్కొంది. దీంతో సౌతాఫ్రికా పర్యటనను కొసాగించేందుకే బీసీసీఐ ఆసక్తి చూపింది.అయితే షెడ్యూల్‌లో కొద్దిపాటి మార్పులు చేసింది. ముందుగా జరగాల్సిన టీ 20ల సిరీస్‌ను వాయిదా వేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటిస్తామని పేర్కొంది. ఈక్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా కేవలం మూడు టెస్టులు, మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ముగిసన వెంటనే దక్షిణాఫ్రికా విమానం ఎక్కనుంది టీమిండియా. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 17న జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా మొదటి టెస్ట్‌ ఆడనుంది.

Related Posts