YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కర్మలని జయించడం ఎలా

కర్మలని జయించడం ఎలా
కర్మలని జయించడం ఎలా ? ప్రారబ్ధం లో లేని కర్మలు.. ఏవి ? శరీరం మనస్సు వేరు కర్మ ఫలాలు అనుభవిస్తాయా ?మన జీవితం లో మనకి బాధ కలిగించే ప్రతి కర్మ ఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము.పొద్దున లేచినప్పటినుండీ, శరీరం అనుభవించే బాధల వలన , పనులు సకాలం లో జరగక పోతే మనకి చిరాకు కలిగి, దానికి కారణం అని అనుకుంటున్న వాళ్ళని నిందిస్తుంటాము. మనకి గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారం తో ఇతరులపై చిందులు వేయడం.మన మనస్సుకి హాయిగా ఆహ్లాదం కలిగిలా ఇతరులు మాట్లాడక పోవడం చేత వచ్చే కోపం. మనకి ఇష్టమైన వారిని ఒకరు విమర్శిస్తే, వారిని తక్షణమే. దూరం చేసుకోవడం. కూడా ఒక చిత్రమైన కర్మ.. దీని వల్ల ఎంతో ప్రియమైన వారైనా, మనల్ని ఎంత ప్రేమించిన వారే అని తెలిసినా, ఒక చిత్రమైన వేదన తో దూరం చేసుకుంటాము. ఇతరులు మనకి నచ్చిన వాళ్ళని తిట్టడం ,మనకి నచ్చని వాళ్ళని పొగడటం చేస్తే మనం క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేక పోవడం వలన వచ్చే పోట్లాటలు. ఇవన్నీ మనం వర్తమాన కాలం లో చేస్తున్న అనవసరమైన కొత్త కర్మలు.మనం ఇలా ప్రారబ్ధం లో లేని కొత్త కర్మలు చేస్తూ , వీటికి తగిన ఫలాలు అనుభవిస్తూ , “ఇదంతా నా ముఖాన రాశి ఉంది”. “నా ప్రారబ్ధం ఇది “ అని అనుకుంటున్నాము.కష్టాలు మీ ప్రారబ్ధం కావచ్చు. ఆ కష్టాలని ఎదుర్కోవడం లో పడే మానసిక వేదన చిరాకు కోపం ఆందోళన ఇతరులని తిట్టడం మీ ప్రారబ్ధం లో లేవు.ఈ సమయం లో మనం మనస్సు ని మాటని అదుపులో పెట్టుకోలేక పోవడం వలన దేనికి తగిన దుష్కర్మ ఫలం వెంటనే అనుభవిస్తాము.మనస్సు వాక్కు అదుపులో లేక పోతే ఫలాలు తక్షణం వస్తాయి.. మనస్సుని మాటని అదుపులో పెట్టుకోగలిగితే, ఈ బాధలు వేదనలు ఏవీ రావు మనం అనుభవించనక్కర లేదు. శరీరం ఇంద్రియాల ద్వారా అనుభవించేది బాధ., సంతోషం:మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన , ఆనందం . మీ ఆనందం మీ చేతి లోనే ఉన్నది అనే విషయం అర్ధం అవుతున్నది కదా.ఎదుటి వాడు మన గత జనం లో మనం వాక్కు ని దుర్వినియోగం చేస్తే , ఇప్పుడు దానికి ప్రతిగా ఎవడో వచ్చి నానా మాటలు అని వెళతాడు.వాక్కు కనుక దుర్వినియోగం ఐతే దానికి ఫలితం వాక్కు అనుభవించవలసి వస్తుంది. అదే వాక్కు శిక్షించబడుతుంది. పదిమంది చేత నిందలు పడటం ద్వారాకాని, కొన్ని సార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దూరం ఐనా ఆశ్చర్యం లేదు. ఈ కర్మ సిద్ధాంత ధర్మసూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వ గలిగితే , మీరు ఆ కర్మ జయించారు, కొత్త కర్మ కూడా చేయలేదు. కర్మలని జయించే పద్ధతి ఇదే శరీరం బాధ పడుతుంటే మనస్సు బాధ పడక్కర్లేదు.” అయ్యో శరీరం బాధ పడుతోందే “ అని మీ మనస్సు కూడా వేదన పొందితే, మీరు లేని కష్టం అనుభవిస్తున్నారు అని అర్ధం. అలాగే మన మనసు వేదన పొందితే , దానిని అదుపులో పెట్టుకోలేక పోతే వెంటనే శరీరం తీవ్రం గా ప్రవితం అవుతుంది అప్పుడు వివిధ వ్యాధులు రావచ్చు. ప్రారబ్ధం ప్రకారం గతం లో ఎవరి మనస్సునో బాధించిన కారణంగా మీ మనస్సు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి మనస్సు అదుపు తప్పడం వలనా ఆ ప్రభావం శరీరం మీద పది ఏ హార్ట్ ఎటాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది ప్రారబ్ధ కర్మ లో లేదు. కేవలం మనస్సు అదుపు లో లేనందువల్ల శరీరం అనవసరం గా అనుభవించే కొత్త కర్మ కొత్త వ్యాధి. ఇది ఏ జాతకం లో కనిపించక పోవచ్చును. మనం తెలివితక్కువగా కొని తెచ్చుకునే కర్మలు వ్యాధులు జాతకమ్మ్ లో కనబడవు దీనికోసం జ్యోతిష పండితులని నిందించకండి . మీ మనస్సుని వాక్కు ని అదుపు లో పెట్టడం నేర్చుకుంటే కర్మలని జయించ వచ్చును. 

Related Posts