50 మంది ఎయిడ్స్ పేషెంట్లకు ప్రగతి సేవా సంస్థ చేయూత
నెల్లూరు డిసెంబర్ 4
నెల్లూరు జిల్లా, గూడూరు టౌన్ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గూడూరు డివిజన్ లో ఉన్న 50 మంది ఎయిడ్స్ పేషంట్లకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం, నుట్రిన్ ఫుడ్స్ ను డాక్టర్ చంద్రహాస్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రహాస్, హెచ్ఐవి డిస్ట్రిక్ట్ మోటివేటర్ ధనంజయ ,బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ మౌలాలి, మాధవి,అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్,ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి ,కుటుంబ సభ్యులు పురంధర్ రాజు, పి.డి కరిముల్లా,గ్రానైట్ ప్రభాకర్ , వాచ్ షాప్ రాము,పూర్ణ చంద్ర,కోఆర్డినేటర్ సి.వి.ఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.