3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇవాళ ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు... ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది..
ఇక మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. మరోవైపు ఉమ్మడి ఏపీలో సీఎంగా, ఆర్థికమంత్రిగా, వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య సేవలను స్మరించుకుంటూ... మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం....ఈ మేరకు డిసెంబర్ 4, 5, 6 తేదీలను సంతాప దినాలుగా ప్రకటించింది... ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం కారణంగా ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు డిసెంబర్ 4 నుంచి 6వరకూ ఆంధ్రదదేశ్ ప్రభుత్వం సంతాప దినాలుగా పాటిస్తుందని ఓ ప్రకటన విడుదల చేశారు....