YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

వసూల్ రాజా ఈ కానిస్టేబుల్

వసూల్ రాజా ఈ కానిస్టేబుల్

నల్లగొండ
ఆర్టీసీ బస్టాండ్ ముందు ఆగిన ప్రైవేటు వాహనాల నుండి డబ్బులు వసూలు చేస్తూ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయిన వీడియో వైరల్ గా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్ డిపో ముందు ప్యాసింజర్ లను ఎక్కించు కోవడానికి వచ్చిన వాహన డ్రైవర్ వద్ద డబ్బులు తీసుకున్న ఘటన వెలుగు చూసింది. ఆర్టీసీ కి సంబంధించిన కానిస్టేబుల్ జానయ్య మిర్యాలగూడ బస్టాండ్ ముందు విధులు నిర్వహిస్తూన్నాడు. ప్రయాణికులను ఎక్కించుకొని పోవడానికి అక్కడకు వచ్చిన వాహన దారుల నుండి కానిస్టేబుల్ జానయ్య డబ్బులు వసూలు చేస్తున్నాడు. కంచే చేను మేసిన చందంగా ఉన్న ఈ ఘటన పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలు బస్టాండ్ వద్ద నిలువకుండా... ప్రయాణికులను ఎక్కించుకొని పోకుండా చూడాల్సిన కానిస్టేబుల్ వసూళ్ల దందాకు బహిరంగంగానే పాల్గొనడం విస్మయాన్ని కలిగిస్తోంది.

Related Posts