YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మే 20వ తేదీ నాటికి రంజాన్ గిఫ్ట్స్

మే 20వ తేదీ నాటికి రంజాన్ గిఫ్ట్స్

రంజాన్ పండుగ సందర్భంగా ఏటా పేద ముస్లిములకు రాష్ట్ర ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేస్తోంది. ఏడాది రంజాన్ పండుగ కోసం తెలంగాణ మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా నాలుగు లక్షల గిఫ్ట్ ప్యాక్‌లు  పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది రాష్ట్రంలోని 800 మసీదుల వద్ద రంజాన్ పండుగ దుస్తుల గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దుస్తులను తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (టీఎస్‌సీఒ) ద్వారా తయారుచేయించి మే 20వ తేదీ పంపిణీ కేంద్రాలకు చేరవేయడానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు పేద ముస్లిం యువతుల పెండ్లిళ్ల కోసం షాదీముబారక్ పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సహాయం రూ.75,116 నుంచి రూ.1,00,116కు పెంచుతూ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయించారని, ఈ పెరిగిన మొత్తం 2018 ఏప్రిల్ 1 నుంచి అందిన దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన అధికారులకు తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు బడ్జెట్ కేటాయించగా, అందులో నుంచి రూ.496.77 కోట్లు వివిధ పథకాలకు ఇప్పటికే విడుదల చేశారన్నారు. ఇందులో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ (ఆర్టీఎఫ్) పథకానికి రూ.248 కోట్లు, ఎంటీఎఫ్ పథకానికి రూ.100 కోట్లు, విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ళే విద్యార్థుల సహాయానికి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి రూ.25 కోట్లు, ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు రూ.30 కోట్లు, షాదీముబారక్ పథకానికి రూ.93.77 కోట్లు విడుదల చేసినట్టు ఏకేఖాన్ తెలిపారు. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎం దానకిశోర్, టీఎస్‌సీవో మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ప్రతి సంవత్సరం మాదిరిగా నిరుపేద ముస్లిములకు రంజాన్ పండుగ కోసం దుస్తులను సరఫరా చేసింది. జిల్లాకు 14,500 రంజాన్ కిట్లు వచ్చాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన రంజాన్ కిట్లను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు స్వీకరించారు. వాటిని జిల్లాలో మైనార్టీల జనాభా ప్రాతిపకదిన కేటాయించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి 4,000 కిట్లు కేటాయించారు. బోధన్‌కు 4,000, ఆర్మూర్‌కు 2,000, బాల్కొండకు 2,000, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 1500 కిట్లను కేటాయించారు. మిగిలిన 1,000 ని వివిధ మండలాల్లో అధికంగా ఉన్న ముస్లిములకు బట్టి కేటాయించనున్నారు. వచ్చిన కిట్లను నియోజకవర్గం కేంద్రం తహసీల్దార్లకు అప్పగించారు. ఈనెల 17 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అనుగుణంగా వాటిని అక్కడ స్థానికంగా పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్న మసీదుల కమిటీలతో పాటు అధికారులు సభ్యులుగా ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టి కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లో చీర, పైజామాతో పాటు సేమియా తదితర వస్తువులు ఉంటాయి.

Related Posts