YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటీఎస్ విషయంలో సహాయనిరాకరణ చంద్రబాబు

ఓటీఎస్ విషయంలో సహాయనిరాకరణ చంద్రబాబు

అమరావతి
ఓటీఎస్ మీద ఆందోళన చేస్తే కేసులు పెడతారా..? కొందరు పోలీసులకు కండకావరం పెరిగింది. పోలీసులు ఉన్నది చట్టాన్ని అమలు చేయడానికే కానీ.. చట్టాన్ని ఉల్లంఘించేందుకు కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కేసులకు భయపడి ప్రజా పోరాటాలు చేయకుండా ఉండం. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష..? టీడీపీ హయాంలో రూ. 10 వేలు ఇచ్చి ఇళ్ల రిపేర్లకు ఇచ్చాం. పేదల ఇళ్ల నిర్మాణాలను షీర్ వాల్ టెక్నాలజీతో చేశాం. గేటేడ్ కమ్యూనిటీ తరహాలో పేదల ఇళ్ల సముదాయాన్ని నిర్మించాం. 2.60 లక్షల ఇళ్లకు శ్రీకారం చుడితే వాటిని పక్కన పెట్టేశారు. కరోనా సెంటర్ల కోసం.. వరద బాధితుల కోసం టిడ్కో ఇళ్లను ఉపయోగిస్తున్నారు. టీడీపీ రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తాం. ఓటీఎస్ విషయంలో ప్రజలు సహయ నిరాకరణ చేయాలి.. టీడీపీ అండగా ఉంటుంది. పేదల ద్రోహి వైసీపీ. పేదలను అవమానిస్తే.. అంబేద్కరును అవమానించినట్టేనని అయన అన్నారు.

Related Posts