ఆసిఫాబాద్
స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో చోరీ జరిగింది. దుండగులు వెల్డింగ్ గ్యాస్ కట్టర్ తో కిటికీలను కట్ చేసి లోపలికి ప్రవేశించినట్లు ఆసిఫాబాద్ ఎస్పి (అడ్మిన్) వై వి ఎస్ సుధీంద్ర తెలిపారు. బ్యాంకు లోపలికి ప్రవేశించిన దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వెల్డింగ్ గ్యాస్ కట్టర్ తో లాకర్ ను కట్ చేసి చోరీకి పాల్పడ్డారన్నారు. లాకర్ పూర్తి స్థాయిలో ఓపెన్ కాకపోవడంతో ఎంత మొత్తం లో సొమ్ము చోరీ జరిగిందో తెలియరాలేదన్నారు. పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ చేపడుతున్నామని చోరీకి పాల్పడ్డారు దుండగులు ప్రొఫెషనల్ దొంగలై ఉంటారని ఆయన తెలిపారు.పూర్తిస్థాయిలో విచారణ అనంతరం వివరాలను వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు.