YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెష‌ల్ ప‌వ‌ర్స్ యాక్ట్‌ చ‌ట్టాన్ని వెంటనే ర‌ద్దు చేయాలి

ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెష‌ల్ ప‌వ‌ర్స్ యాక్ట్‌ చ‌ట్టాన్ని వెంటనే ర‌ద్దు చేయాలి

న్యూఢిల్లీ డిసెంబర్ 6
ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెష‌ల్ ప‌వ‌ర్స్ యాక్ట్‌(ఏఎఫ్ఎస్‌పీఏ) చ‌ట్టాన్ని త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ర‌ద్దు చేయాల‌ని ఏఐఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఇవాళ లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ  ఏ దేశంలోనూ ఇలాంటి రాక్ష‌స చ‌ట్టం లేద‌న్నారు. నాగాలాండ్‌లో జ‌రిగిన ఆర్మీ కాల్పుల ఘ‌ట‌న‌ను ఖండించిన ఆయ‌న‌.. హంత‌కుల‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తుందా అని ఆయ‌న అడిగారు. అణిచివేత‌కు, ద్వేషానికి ఆఫ్సా సింబ‌ల్‌గా మారింద‌ని ఆరోపించారు. ఇన్‌ఫార్మ‌ర్‌గా స‌మాచారం ఇచ్చిన‌వాళ్లు చైనాకు చెందిన‌ వ్య‌క్తులా అని ఓవైసీ ప్ర‌శ్నించారు.నాగాలాండ్‌లో శనివారం భద్రతా బలగాలు చేపట్టిన తీవ్రవాద నిరోధక ఆపరేషన్‌లో భారీ తప్పిదం జరిగింది. ఓ వాహనంలో వెళ్తున్న కూలీలను తీవ్రవాదులుగా పొరబడిన బలగాలు వారిపైకి కాల్పులు జరిపాయి. మోన్‌ జిల్లాలో మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. దీనిపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సాయంత్రం స్థానికులంతా సైన్యాన్ని చుట్టుముట్టారు. ఆత్మ రక్షణ కోసం బలగాలు మళ్లీ ప్రజలపైకి కాల్పులు జరిపాయి. ఈ సారి కాల్పుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తంగా 13 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. తర్వాత చెలరేగిన హింసలో మరో పౌరుడు, ఒక సైనికుడు కూడా చనిపోయాడు. మరికొంత మంది సైనికులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మోన్‌ జిల్లాలో కర్ఫ్యూ విధించారు.

Related Posts