YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం సరే... పార్టీ అధినేతగా... మాత్రం

సీఎం సరే... పార్టీ అధినేతగా... మాత్రం

విజయవాడ, డిసెంబర్ 7,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సీఎంగా సక్సెస్ అయ్యాడేమో తెలియదు కాని పార్టీ అధినేతగా మాత్రం ఫెయిలయ్యాడనే చెప్పాలి. సీఎంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొంత విపక్షాలను ఇరకాటంలో నెడుతున్న జగన్ సొంత పార్టీని మాత్రం కంట్రోల్ లో పెట్టలేకపోతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో జగన్ అట్టర్ ప్లాప్ అయ్యారన్నది అందరూ అంగీకరిస్తున్న సంగతి. రఘురామ కృష్ణరాజు సంగతి అందరికీ తెలిసిందే. తనను కవ్విస్తే మరింత రెచ్చిపోతాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మానాన ఆయనను వదిలేసి ఉంటే బాగుండేది. కానీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతుండటంతో రఘురామ కృష్ణరాజు మరింత రెచ్చిపోతున్నారు. పార్లమెంటులో ప్రభుత్వం, పార్టీ పరువును రోజూ గాలి తీసేస్తున్నారు. రఘురామ కృష్ణరాజును కదిలించుకోవడం తేనెటీగల తుట్టెను కదిలించుకోవడమే. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు సయితం రఘురామ కృష్ణరాజు విషయంలో జగన్ తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. అలాంటి వారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే వారి ఇగో తృప్తి పడుతుంది. అలాకాకుండా నెగ్లెక్ట్ చేస్తే వారు మరింత రెచ్చిపోతారు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు విషయంలో అదే జరుగుతుంది. తనను, తన ప్రభుత్వాన్ని రోజూ తిడుతున్నాడని తెలుసు. అయినా ఆయనను జగన్ ఏమీ చేయలేకపోతున్నారు. పోతే పోయింది ఒక్క సీటు అనుకుని రఘురామ కృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే దరిద్రం వదిలపోతుందన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. రోజూ ఈ టార్చర్ పడేకన్నా అదే బెటర్ అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇక ఉండదని కూడా తెలుసు. అంతకంటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన వేరే పార్టీలో ఉండి చేసే విమర్శలకు విలువ ఉండదు. మరి జగన్ ఈ విషయంలో అట్టర్ ప్లాప్ అయినట్లే కదా?

Related Posts