YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నల్గొండ పట్టణంలో దొంగల హల్ చల్

నల్గొండ పట్టణంలో దొంగల హల్ చల్

నల్గొండ
నల్గొండ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. ఈనెల 5 తేదీ రాత్రి వీటీ కాలనీలో.. మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటaనారాయణ ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి ఇంటి పరిసరాలను అన్నింటినీ గమనించి.. దొంగతనానికి యత్నించిన దృశ్యాలు సిసి  కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలోనూ బీటీ కాలనీల్లో తెల్లవారుజాము సమయంలో ఒంటిపై బట్టలు లేకుండా దుండగుడు తిరిగిన దృశ్యాలు పలు ఇళ్ళ ముందు ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ ఘటన మరిచిపోకముందే తాజాగా ఇళ్లల్లోకి ఆగంతకుడు ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించడం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులు నిందితుడిని పట్టుకున్న స్థానికులు కోరుతున్నారు. అందరూ అలెర్ట్ గా ఉండాలని అనుమానం వస్తే 100 డయల్ కు కాల్ చేయాలని నల్లగొండ పట్టణ పోలీసులు సూచిస్తున్నారు.

Related Posts