పోలీసులు నేరస్తులకు కొమ్ము కాస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు ప్రమాదానికి కారకుడైన నిందితులపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల పులికుంట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడానికి కారకుడైన నిందితుడిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరికి నిరసనగా రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీనితో వాహన రాకపోకలకు నిలిచిపోయాయి. బొలెరాతో ఆటోను ఢీకొట్టిన వైసీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి పై కేసు నమోదు చేయడంలో పోలీసులు తీరు బాధాకరమని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.కళ్యాణదుర్గం డివిజన్ డిఎస్పీ ఆధ్వర్యంలో రాయదుర్గం అర్బన్ సీఐ సురేష్ బాబు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితుల మండిపడ్డారు.రోడ్డు ప్రమాదానికి కారకుడైన వైసీపీ నాయకుడు గోనభావి ప్రతాప్ రెడ్డి పేరు కేసు నమోదు చేయకుండా పోలీసులు మిని మేషాలు లెక్కిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పోలీసులు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ కన్నీరుగార్చారు. ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు..