విశాఖపట్నం
విశాఖ జిల్లా పాడేరు సమీపాన ఉన్న వజంగి కొండల్లో పొగ మంచు అందా లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.వాటిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు తరలివెళ్తున్నా రు. కొండలు ఎక్కుతూ.. వంజంగి ప్రకృ తి వయ్యారాన్ని ఆస్వాదిస్తున్నారు. మన్యంలోని మంచు అందాలు పర్యా టకులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నా యి. మండలంలోని వంజంగి లోని మంచుకొండలను తిలకించేందుకు సం దర్శకులు వందలాది మంది తరలివ చ్చారు. పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లను వంజంగి యువకులు చేస్తు న్నారు.పర్యాటకులు అక్కడ రాత్రి బస చేసేందుకు అవసరమైన గుడారాలు, ఫైర్ క్యాంఫియన్లకు కట్టెలు వంటి వి ఏర్పాట్లు చేస్తున్నారు. మంచు కొండల్లో సందర్శకుల మనసు దోచేందుకు ఉద యం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు వాతావరణం అనుకూలిస్తు న్నది. పర్యాటకులు ముందు రోజు రాత్రే అక్కడకు చేరుకోవడంతో వంజం గి మంచుకొండల్లో పర్యాటకుల రాత్రి బసలు పెరిగాయి.