YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు ఒక సువర్ణ అధ్యాయం : సీఎం కేసీఆర్

రైతు బంధు ఒక సువర్ణ అధ్యాయం : సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్యకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం గురువారం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమయింది. సీఎం కేసీఆర్  ఇక్కడి  జిల్లా ధర్మరాజు పల్లి గ్రామానికి చెందిన రైతులకు పాస్బుక్కు, చెక్కులు పంపిణీ చేశారు. ఈ పథకం కింద రైతులకు ఏటా ఎకరానికి 8 వేల రూపాయల పెట్టుబడి సాయం అందనుంది. 12 వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమత్రి మాట్లాడుతూ ఈరోజు దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.  బంగారు పంటలను పండించాలని రైతులను కోరుతున్నట్లు స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సాయం చేసిన గౌరవం తెలంగాణకు దక్కుతుందన్నారు. మద్దతు ధర కోసం ఎంపీలు కేంద్రంతో పోరాడతారని కేసీఆర్ తెలిపారు.  రైతుబంధు పథకం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని అయన అన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి  అన్నారు. తెలంగాణ వస్తే చీకట్లే అని హేళన చేశారన్నారు. 20 శాతం సొంత రాబడి కలిగిన రాష్ట్రం ఒక్క తెలంగాణే అని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర ఉందన్నారు.  58 లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు, పెట్టుబడి చెక్కులు అందించడం జరుగుతుందన్నారు. 

వ్యవసాయం బాగున్నప్పుడే దేశం బాగుంటుందని కేసీఆర్ అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలన్నారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఇప్పుడున్న ధరలో నాలుగోవంతు ధర పెంచి మద్దతు ప్రకటించాలన్నారు. పంట పెట్టుబడి రైతుకు మాత్రమే ఇస్తామని, కౌలుదారులకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కౌలుదారుల సంగతి రైతులే చూసుకోవాలన్నారని స్పష్టం చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మూడు పంటలు పండించవచ్చునని  కేసీఆర్ అన్నారు. ఆంధ్ర సీఎంలు తెలంగాణ ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టారన్నారు. ఆనాడు ఈ కాంగ్రెస్ నేతలు నోరు మెదపలేదని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరూపాయి కూడా ఇవ్వనంటే ఒక్క నేత కూడా కిక్కురుమనలేదు. ఆనాడు నోరు మూసుకున్న నాయకులు ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్  మండిపడ్డారు.

రైతు సమన్వయ సమితి సభ్యులు చెక్కుల పంపిణీలో ఇబ్బందులను పరిష్కరించాలని సీఎం నిర్దేశించారు. చెక్కులు అందజేయడంలో ఇబ్బందులుంటే తమకు తెలియజేయాలని రైతులకు సీఎం సూచించారు.

Related Posts