అమరావతి డిసెంబర్ 7
కోర్టు ధిక్కరణ విషయంలో జడ్జిలు జరిమానాలతో పాటు సామాజిక శిక్షలు వేస్తున్నారు. తాజాగా అనంతపురం కోర్టు ఇదే పని చేసింది. ఓ డీఈవో కోర్టు ధిక్కరించాడని అతడికి వారం రోజుల పాటు సమాజ సేవ చేయాలని ఫనిష్మెంట్ ఇచ్చింది. తమ ఆదేశాలను పాటించకపోవడమేంటే కోర్టును అవమానించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. ఇంతకీ ఆ డీఈవో ఏంచేశాడు..? కోర్టు ఎలాంటి శిక్ష వేసింది..? అనంతపురం జిల్లాకు చెందిన పి. వెంకటరమణ సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అతడికి సీనియారిటీ కల్పించే విషయమై 2019 లో హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఆయన పిటిషన్ పై విచారించిన కోర్టు వెంకటరమణకు సానుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఆయనకు సినియారిటీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే డీఈవో కోర్టు చెప్పినట్లు నడుచుకోలేదు. వెంకటరమణకు సినియారిటీ కల్పించకపోగా.. కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. దీంతో వెంకటరమణ డీఈవోపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశాడు. సోమవారం ఈ వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాలను డీఈవో ఏడాదిపాటు పాటించలేదు. అంతేకాకుండా అతడికి సినీయారిటీ కల్పించలేదు. ఇందుకు డీఈవోనే బాధ్యుడని తెలిపింది. వెంటనే డీఈవో కోర్టుకు క్షమాపణ చెప్పాడు. క్షమాపణలను కోర్టు ఒప్పుకోలేదు. కమాపణల కన్నా వారం రోజుల పాటు సమాజిక సేవ చేయాలని ఆదేశించింది. వృద్ధాశ్రమంలో గానీ ఆనాథాశ్రమంలోగానీ వారం రోజుల పాటు భోజన ఖర్చులు భరించాలని తెలిపింది. తమ ఆదేశాలను పాటించకపోవడం అంటే కక్షిదారులకు న్యాయం చేయకుండా ఉండడమనేనని భావించి ఈ శిక్షలను విధించింది. అంతేకాకుండా కోర్టును అవమానించిందుకు దీనిని భరించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో తప్పు చేసినవారు న్యాయస్థానం నుంచి ఎవరూ తప్పించుకోలేరని చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుడు కోర్టును నమ్ముకోవడంపై ఆయనను పలువురు అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తారు. కానీ ఆ కోర్టుకే అన్యాయం చేస్తే ధర్మం ఊరుకుంటుందా..?