YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీలో తీన్మార్ మల్లన్న

బీజేపీలో తీన్మార్ మల్లన్న

బీజేపీలో తీన్మార్ మల్లన్న
న్యూఢిల్లీ, డిసెంబర్ 7,
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి.తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చాను. నాపై 38 కేసులు పెట్టారు. ఏం సాధించారు. పోలీసులు బాధపడ్డారు. జడ్జీలు మథన పడ్డారు. బీజేపీలోకి వెళ్లే అవకాశం నాకు దక్కింది. ప్రజలలోకి వెళ్లి నీ పాలనపై పోరాడుతాం. సమాజంలోని ఉద్యమకారులంతా ఒకటవుతున్నారు.అంతకుముందు తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ , తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్నకు పార్టీ సభ్యత్వ రసీదు ఇచ్చి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తరుణ్ చుగ్. జర్నలిస్ట్ నవీన్ కుమార్ సమస్యలపై పోరాడే వ్యక్తి. నవీన్ కుమార్ కు బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాను. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే. కేసీఆర్ దోపిడీ, కుటుంబపాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురుచూస్తుంటారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గణనీయంగా పట్టభద్రుల ఓట్లు సాధించారు. ప్రజా సమస్యలపై యాత్రలు చేస్తుంటే ఎంపీలపై దాడులు,కేసులు పెడుతున్నారు. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు తరుణ్
చుగ్.
త్వరలో చరమగీతం
తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోడి ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటూ పేదల కోసం పనిచేస్తోంది. తెలంగాణలో అందుకు భిన్నంగా అవినీతి, రాక్షస, కుటుంబం పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి మల్లన్న. తన కలంతో గళమెత్తుతుంటే జీర్ణించుకోలేని సీఎం కేసీఆర్ పోలీసు కేసులతో అనేక కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని తెలిపారు.ఇక ఇప్పటికే మల్లన్నపై కేసీఆర్ అనేక నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి వేధించారు. అయినా వెరవని మల్లన్న తాను ఎంచుకున్న దారిలో వెళుతూ అమరవీరుల ఆశయం కోసం పోరాడుతున్నారు. మల్లన్నపై పదేపదే కావాలని కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. మల్లన్నను చూసి మేం బాధపడ్డాం. మలన్నకు అండగా నిలబడ్డాం. తెలంగాణలోని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలంటే అది బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమకారులు భావిస్తున్నారు. విఠల్, మల్లన్న వంటి నేతలకు రాజకీయ స్వార్థం లేదు. పోరాడే తెలంగాణ ఉద్యమకారులు, పోరాట పటిమ ఉన్న నేతలు. వారి లక్ష్యాలకు అనుగుణంగా బీజేపీ ఉద్యమిస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ కుటుంబ, అవినీతి, నియంత ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతాం. కేసీఆర్ రాక్షస పాలనకు చరమగీతం పాడతాం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు వేదిక బీజేపీ. కాబట్టి బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమానికి మద్దతు పలకాలని రాష్ట్రంలోని తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నాను అని పేర్కొన్నారు.
కేసీఆర్ కు భయపడేది లేదు
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌, బీపేజీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అంటుంటే.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము టీఆర్‌ఎస్‌కో, కేసీఆర్‌కో భయపడేవాళ్ల కాదని.. ఒకవేళ భయపడితే రైతులకు భయపడుతామని ఆయన అన్నారు.అంతేకాకుండా మెడ మీద కత్తిపెట్టి సంతకం చేయించుకున్నారని కేసీఆర్‌ అనడం దురదృష్టకరమని, ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. బాయిల్డ్‌ రైస్‌పై అగ్రిమెంట్ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వమేనని ఆరోపించారు. హుజురాబాద్‌లో ఓటమి కేసీఆర్‌ జీర్ణించుకోలేక ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Related Posts