YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జనవరి నుంచి మళ్లీ మోడీ టూర్

జనవరి నుంచి మళ్లీ మోడీ టూర్

జనవరి నుంచి మళ్లీ మోడీ టూర్
న్యూఢిల్లీ, డిసెంబర్ 7,
 విదేశాలతో భారతదేశం సత్ససంబంధాలు నెలకొల్పే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేగంగా వేస్తున్నారు. చిన్ని పెద్ద అన్ని దేశాల్లో పర్యటిస్తూ దౌత్యపరమైన సంబంధాలు పెంపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిత్రదేశాలైన యూఏఈ, కువైట్‌ల 2022 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలతో 2022 విదేశీ ప్రయాణ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ప్రధాని మోడీ ‘దుబాయ్ 2020 ఎక్స్‌పో’ని సందర్శించనున్నారు. COVID-19 మహమ్మారి రెండవ వేవ్ సమయంలో భారతదేశానికి అండగా నిలిచినందుకు రెండు మిత్రదేశాలకు ధన్యవాదాలు చెప్పడం ఈ పర్టన ముఖ్య ఉద్దేశ్యమని విశ్వసనీయవర్గాల వెల్లడించిన సమాచారం.కరోనా రెండవ వేవ్ సమయంలో భారీ భారతీయ ప్రవాసులను రెండు దేశాలు ఆదుకున్నాయి. భారతదేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సుమారు 4 మిలియన్ల మంది నివసిస్తున్నారు. కువైట్‌లో సుమారు 1 మిలియన్ విదేశీ భారతీయులు ఉన్నారు. అవసరమైన సమయాల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ధన్యవాదాలు తెలపడంతో పాటు రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సాగనుంది.
ఈ మొత్తం పర్యటన గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాన్నప్పటికీ, 2022 జనవరి మొదటి 10 రోజుల్లో ప్రధాని మోడీ ఈ రెండు దేశాలను సందర్శించవచ్చని తెలుస్తోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో భారత విదేశాంగ విధానానికి ఇరు దేశాలు కేంద్రంగా ఉన్నందున ఈ రెండు విదేశీ పర్యటనలకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts