ఈశ్వరుడి సృష్టిలో వైవిధ్యం ఆశ్చర్యకరం.
నీటిలో, నేలమీద, ఆకాశంలో... అన్ని చోట్లా జీవులు కనబడతాయి. చెట్లకు కాళ్లు చేతులు లేవు. కానీ అవి హాయిగా జీవిస్తూ, తమ జాతిని అభివృద్ధి చేసుకుంటూ, ఇతర ప్రాణులకు ప్రాణవాయువును, ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయి. ఈ ప్రాణుల్లో ‘మనిషి సృష్టి’ అత్యద్భుతం. ప్రతికూల పరిస్థితుల్లోనూ జీవించగల మనుషులు మన పరిసరాల్లోనే ఎందరో కనబడుతుంటారు.
కశ్యపుడికి ఇద్దరు భార్యలు- కద్రువ, వినత. ఇద్దరూ గర్భవతులయ్యారు. కద్రువ అండాలు పగిలి సర్పాలు బయటకు వచ్చాయి. వినత ఓపిక పట్టలేకపోయింది. ఒక పుల్లతో తన అండాల్లో ఒకదాన్ని పొడిచింది. అందులో నుంచి కాళ్లు లేని అనూరుడు ఉద్భవించాడు. తన శరీరం పూర్తిగా ఏర్పడకముందే అండాన్ని పగలగొట్టిన తల్లిపై అతడు కోపించాడు. రెండో అండాన్ని ముట్టుకోవద్దని హెచ్చరించాడు. సూర్యుడి రథసారథి ఈ కాళ్లు లేని అనూరుడే! నిరంతరం వేగంగా పరిభ్రమించే సూర్యరథాన్ని క్రమం తప్పకుండా నడుపుతున్న అనూరుడు అందరికీ గొప్ప ఆదర్శం. రామాయణ ఇతిహాసంలో కనిపించే పరోపకార పరాయణులైన సంపాతి, జటాయువులు ఇతడి కుమారులే!
ప్రతి మనిషికీ అన్నీ అమరడం అరుదు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ పేదరికం అనేది భయంకర శాపమై ముందుకు పోనివ్వకుండా కట్టిపడేస్తుంది.
చిత్రంగా మహాత్ముల్లో ఎక్కువ మంది పేదరికంలో నుంచి వచ్చినవారే కావడం గమనించ వచ్చు.
మనకు ఆదర్శ పురుషులైన మహాత్ముల్లో ఎక్కువమంది తమ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినవారే! ఆ ఇబ్బందులేవీ వారిని ధర్మమార్గం నుంచి తప్పించలేకపోయాయి.
సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉండటానికి సంసిద్ధుడయ్యాడు.
పాండవులు అరణ్యవాసం చేశారు.
గోవులకు కాపలాదారులుగా, గుర్రాలను మేపుతూ, వంటచేసే వారిగా జీవించారు.
నలచక్రవర్తి భార్యతో సహా సర్వస్వం కోల్పోయి అడవుల్లో సంచరించవలసి వచ్చింది.
కృష్ణుడు పసితనం నుంచి ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదిరగకుండా వీరందరూ తమ ధర్మాన్ని తప్పక అనుసరించారు.
భాగ్యవంతులు దురదృష్టవశాత్తు పేదవారిగా మారినప్పుడు సైతం నీతిమార్గాన్ని వదలక జీవితాన్ని గడపడం వల్ల సత్కీర్తినందుతారు.
నెపోలియన్ చరిత్రలో చాలా గట్టివాడు! నిజానికి అతడు పొట్టివాడు. నిరుపేదల ఇంట్లో జన్మించాడు. పొట్టివాడవడం వల్ల మిత్రులు ఎగతాళి చేసేవాళ్లు. పేదరికం వల్ల సమాజం అగౌరవపరచేది. ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనే ప్రయత్నంలో అతడి పట్టుదల పెరిగి, ఎన్నో యుద్ధాలు చేసి విజయం పొందాడు. ఒక రాజకుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు!
దురాచారాలకు తల ఒగ్గడం, దీనులకు నిస్సహాయులకు సహాయం చేయకుండా ఉండటం మొదలైనవి దుర్లక్షణాలు.
దురాచారాలను దూరం చేయడం, దుఃఖిత మతులకు సహాయపడటం ఉత్తమ వ్యక్తుల లక్షణాలు.
ఈ ప్రయత్నంలో జరిగే సంఘర్షణకు సంస్కర్తలెప్పుడూ సంసిద్ధులై ఉంటారు.
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయరామ జయ జయరామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
శ్రీ రామ జయ రామ జయ జయ రామ