YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జిల్లా అంటే నాకు సెంటిమెంటు : సీఎం కేసీఆర్

జిల్లా అంటే నాకు సెంటిమెంటు : సీఎం కేసీఆర్

కరీంనగర్ జిల్లా కేసీఆర్ కి సెంటిమెంట్ ఉన్నా జిల్లా. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించిన విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నాడు జరిగిన రైతు బంధు కార్యక్రమంలో అయన తనకు, జిల్లాకు వున్న అనుబంధాన్ని వివరించారు. కేసీఆర్ మాట్లాడుతూ మొదటి సింహా గర్జన కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసాం. తెలంగాణ లో తెలివే లేదు అన్నారు. సివిల్స్ టాపర్ అనుదీప్ కూడా మన కరీంనగర్ బిడ్డ ..చాలా మంది పిల్లలు సివిల్స్ ర్యాంక్ లు సాధించారని అయన గుర్తు చేసారు. తెలంగాణ 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. హోమ్ గార్డ్స్ ,అంగన్ వాడి,ఆశావర్కలకు జీతాలు ఎక్కువగా ఇస్తున్నాం. ఇందులో చాలా మంది అధికారుల కృషి ఉంది. చరిత్ర లో ఎప్పుడూ అయిన అనుకున్నామా మన ఊరికి వచ్చి సర్వే చేస్తారు అనిఅయన అన్నారు. కొత్తగూడెం లో 800 మెగా వాట్ల విద్యుత్ వస్తది. వ్యవసాయం బాగుంటే దేశం బాగుంటది. మద్దుతూ కోసం ప్రధాని తో మన ఎంపీ లు పార్లమెంట్ లో కొట్లాడుతున్నారని అన్నారు. జాతీయ ఉపాధి హామీ లకు ఇచ్చే నరేగా ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి...సగం కూలీలు సగం ప్రభుత్వం భరించాలి. 4 వ వంతు మద్దతు ధర పెంచాలి అని...కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చాలా మంది ప్రాజెక్ట్స్ లను సందర్శించి అద్భుతంగా వెళ్తున్నారు. ప్రాజెక్ట్స్ లకు వచ్చే నీళ్ల పై  మహా రాష్ట్ర తో శాశ్వత ఒప్పందం చేస్తుకున్నాం. ఈ సంవత్సరం చివరి వరకు నీళ్లు వస్తవి..నిత్య తోరణం లా ఉండనుందని అయన అన్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ లో కొత్త రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తాం. ధరణి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ల ను చూసుకోవచ్చు. జూన్ 2 తరువాత లోన్ కోసం పాస్ బుక్స్ బ్యాంక్ లలో పెట్టె అవసరం ఉండదని అన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి500 కోట్లు మంజూరు చేసారు సీఎం. ఆలిండియా సివిల్స్ ర్యాంక్ లు సాధించిన చింత కుమార్ గౌడ్ పోరెడ్డి సాయినాథ్ రెడ్డి ఆలేఖ్య, వారి కుటుంబ లను కేసీఆర్ సన్మానించారు. 

Related Posts