YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రెండేళ్లలో 55 వేల కోట్ల రుణం

రెండేళ్లలో  55 వేల కోట్ల రుణం

విజయవాడ, డిసెంబర్ 8,
ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోతుంది. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పులు చేసిన జగన్ అభివృద్ధి వైపు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఎక్కడ అప్పు పుడితే అక్కడ తెచ్చేసుకుని సంక్షేమ పథకాలకు జగన్ కేటాయిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. వారే చెల్లించాలి..... టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ ఏ బ్యాంకుల నుంచి ఎంత రుణాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుందో వెల్లడించారు. ఏపీలో నలభై కార్పొరేషన్లకు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, వీటిని చెల్లించాల్సిన బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా చేసిన అప్పుల చిట్టాను కేంద్ర మంత్రి విప్పారు. వివిధ బ్యాంకుల నుంచి... ఎస్.బి.ఐ. నుంచి తొమ్మిది సంస్థలు 11,397 అప్పును, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లు కలపి 10,865 కోట్ల రుణాన్ని తీసుకున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మూడు సంస్థలు ఏడు వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 4 సంస్థలకు 2,970 కోట్లు, కెనరా బ్యాంకు నుంచి 4,099 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంకు నుంచి 750 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇండియన్ బ్యాంకు నుంచి 5,500 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి 1,750 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 5,633, యూనియన్ బ్యాంకు నుంచి 6,975 కోట్ల రూపాయలను రుణం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దాదాపు యాభై వేల కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుంది.రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేవ్‌లో 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంఎనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు. అయితే 2019 నుంచి 2021 వరకు జాతీయ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు వివరించారు.స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్ల రుణం, బ్యాంక్‌ ఆఫ్‌ భరోడా నుంచి 5 కంపెనీలు, కార్పొరేషన్లు రూ.10,865 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7 వేల కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్ల రుణం అందించాయి. ఇక కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకు నుంచి రూ.750 కోట్లు రుణం మంజూరు చేశాయి.ఇంకా.. ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి రూ.5,500 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంకు నుంచి రూ.1,750 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు, యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు రుణం పొందినట్లు మంత్రి వివరించారు.

Related Posts