YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్ ఎస్- బీజేపీ ల మధ్య రహస్య బంధం

 టీఆర్ ఎస్- బీజేపీ ల మధ్య రహస్య బంధం

హైదరాబాద్, డిసెంబర్ 8,
పది రోజులుగా ఢిల్లీలో పార్లమెంట్‌ వేదికగా పోరాటం చేసిన టీఆర్ ఎస్.. సమావేశాలను బాయ్‌ కాట్‌ చేసి జనాల్లో తేల్చుకుంటామని ప్రకటించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆ పార్టీ ఎంపీలు విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం తాము పోరాటం చేస్తుంటే కేంద్రం సమాధానం దాట వేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి ఢిల్లీకి పంపితే బీజేపీ ఎంపీలు కనీసం రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదంటున్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీ నిజస్వరూపం బయటపెడతామని చెబుతున్నారు.రాష్ట్రాలతో జరిగిన ఒప్పందాల ప్రకారమే వరి సేకరణ ఉంటుందని.. హుజూరాబాద్‌ ఓటమి తర్వాత కేసీఆర్‌ కోపంలో లేని వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. పార్లమెంటులో ఎంపీల కిసాన్‌ బచావో నినాదం కూడా కేసీఆర్‌ బచావో అంటున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ విమర్శలు, ప్రతివిమర్శలతో దూకుడుగా ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి తోడు ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి.పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ సారధ్యంలోని విపక్షాల ఆందోళనకు గులాబీ మద్దతిచ్చింది. కాంగ్రెస్, టీఆర్ ఎస్ కలిసి నిరసనలో పాల్గొన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని బీజేపీ  ప్రచారం మొదలుపెట్టింది. ఇది తెలంగాణలోని కాంగ్రెస్ నేతలను ఇరుకునపెడుతోంది. దీంతో రంగంలో దిగిన పీసీసీ నేతలు బీజేపీ-టీఆర్ ఎస్ ఒక్కటే అంటూ కౌంటర్‌ ఎటాక్‌ మొదలుపెట్టారు. బీజేపీ డ్రామాలో టీఆర్ ఎస్‌ పాత్రధారి అంటోంది కాంగ్రెస్‌. పార్లమెంటులో చర్చలు జరగకుండా టీఆర్ ఎస్ ను బీజేపీ ప్రయోగించిందని.. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని మళ్లీ హైదరాబాద్‌ ఎంపీ లను కేసీఆర్‌ రప్పించారని ఆరోపిస్తోంది.ఎవరికి వారు తెలంగాణలో రాజకీయ అధిపత్యం కోసం మైండ్‌గేమ్‌ ఆడుతున్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటిదాకా హస్తినలో ఫైటింగ్‌ చేసిన నేతలు ఇప్పుడు గల్లీ బాటపడుతున్నారు. ఇంతకీ తెలంగాణలో ఎవరు ఎవరితో జత కడుతున్నారు.. ఎవరు ఆదేశిస్తే మరెవరు పాటిస్తున్నారు. కాంగ్రెస్‌ చెబుతున్నట్టు టీఆర్ ఎస్- బీజేపీ ల మధ్య రహస్య బంధం ఉందా? బీజేపీ ప్రచారం చేసినట్టు టీఆర్ ఎస్- కాంగ్రెస్‌ పొత్తులకు సిద్దమవుతున్నాయా? అనేది కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్న

Related Posts