YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇది శుభదినం : మంత్రి హరీశ్ రావు

ఇది శుభదినం : మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం జరిగిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ  ఇవాళ శుభదినం. ఇది మీ జీవితంలో మరపురాని రోజు అని అన్నారు.  భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూమి కబ్జాలో ఉన్న వారికి పూర్తిస్థాయిలో భూమి హక్కులు కల్పిస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం.  రెండవ దశలో మీ భూమికి ఎకరాకు 4 వేల పెట్టుబడి చెక్కులు అందజేస్తాంమని అన్నారు.  రైతుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగు నింపుతున్నారు.  ఇన్నాళ్లు పాలించిన వారు భూములు గుంజుకున్నారే..,  తప్ప, పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదని గత ప్రభుత్వాల ప్రతిపక్షాల తీరుపై మంత్రి మండిపడ్డారు.  జిల్లాలో 8 వేల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.  భూములకు హక్కును కల్పించి హక్కుదారులు చేసిన దేశంలోనే  ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.  పేర్లను రికార్డులకు ఎక్కించి ఈ రోజు నుంచి సర్వ హక్కులు కల్పిస్తున్నామన్నారు.  స్ప్రింక్లర్లు , విత్తనాలు, బ్యాంకు రుణాలు, వడగండ్ల వానకు నష్ట పరిహారం అందించాలంటే ఇబ్బంది ఉండేది ఇప్పుడు  ఆ బాధలుండవ్.  గత ప్రభుత్వాలు భూములు గుంజుకుంటే మన ప్రభుత్వం భూమికి హక్కు కల్పించి పట్టాలు ఇస్తున్నది.  గజ్వేల్, జగదేవ్ పూర్, మర్కూక్, కొండపాక నాలుగు మండలాల్లోని 302 మంది రైతులకు అసైన్డు భూముల ప్రోసిడింగ్స్ కాపీ పత్రాలను అందజేశామని, త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.

Related Posts