విశాఖపట్నం
మంచు తెరల మధ్య పసు పు వర్ణంతో మెరిసిపోయే వలిసె పూలు ప్రకృతి కాంతకు స్వర్ణ కాంతులద్దుతాయి. విశాఖ మన్యానికొచ్చే పర్యాటకు ల మనసులను ఇట్టే దోచుకుంటాయి. ఏటవాలు కొండ ప్రాంతాల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసె తోటలు చూడముచ్చటగా కనువిందు చేస్తున్నాయి.ప్రముఖ పర్యాటక కేంద్ర మైన అందాల అరకు లోయలో వలసే పువ్వుల అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఈ సీజన్లో గిరిజన రైతులు వాణిజ్య సాగు గా పండించే వలిసేపూల తోటలు అరకు లోయ అందాలకు ఎంతోగానో వన్నె తెస్తున్నాయి. ప్రకృతి సహజసిద్ధంగా వెలిసిన అందాలకు వలి సెల సొగసు లు తోడవడంతో అరకు లోయ మరిం త ఆకర్షణీయంగా కనిపిస్తుంది.అరు కు సందర్శనకు వచ్చే పర్యాట కులు సరికొత్త అందాలను తిలకించి అబ్బుర పడుతున్నారు.అరకులోయ అందాల ను వర్ణించడం ఎవరితరం అంటూ పర్యాటకులు చెప్పుకుంటున్నారు. పసుపు చీర కట్టినట్లు ఎటుచూసినా పసుపుపచ్చని వలిసే పూల తోటలు చూడచక్కగా కనిపించడంతో పర్యా టకుల ఆహ్లాద భరితులవుతున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న వలిసె పూలతోటలో ఫోటోలు దిగుతూ సెల్ఫీ లు తీసుకుంటూ ఆనందంగా గడుపు తున్నారు.కుటుంబ సమేతంగా సంద ర్శనకు వచ్చే పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి పూల తోటల మధ్య గ్రూప్ ఫోటోలు దిగుతూ మధురాను భూతిని పొందుతున్నారు.అరుకు అందాలను వీక్షించాలంటే నవంబరు, డిసెంబరు మాసాలలో తప్పనిసరిగా పర్యటించాలని పలు ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు చెప్పుకుంటున్నా రు.ఆహ్లాద భరితమైన వాతావరణం, అందాలకు నిలయం ప్రకృతి, అందా లకు ఆలవాలమైన అరకు లోయ కు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. అన్ని పర్యాటకులు అంటున్నారు. ఇదిలా ఉండగా డిసెంబర్ ప్రథమార్థం వరకు మాత్రమే వలి సెల సొగసులు పర్యాట కులకు కనువిందు చేస్తున్నాయి.