YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తుదిఘట్టానికి చేరిన పాదయాత్ర...చిత్తూరు జిల్లాలో ప్రవేశం

తుదిఘట్టానికి చేరిన పాదయాత్ర...చిత్తూరు జిల్లాలో ప్రవేశం

చిత్తూరు
అమరావతి రైతుల మహా పాదయాత్ర చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది.  ఇన్ని రోజులు తమను ఆదరించిన నెల్లూరు వాసులకు అన్నదాతలు భావోద్వేగ వీడ్కోలు పలికారు.  శ్రీకాళహస్తిలోకి అడుగుపెట్టిన రైతులకు స్థానికులు ఎదురొచ్చి ఘన స్వాగతం పలికారు. మేము సైతం అంటూ పాదం కలిపారు.  ఏకైక రాజధాని కోసం న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర తుది ఘట్టానికి చేరుకుంది.  17 రోజులపాటు పాదయాత్రకు నీరాజనాలు పలికిన నెల్లూరు గడ్డకు అమరావతి రైతులు, ఐకాస నేతలు భావోద్వేగ వీడ్కోలు పలికారు.  సింహపురి వాసులకు ధన్యవాదాలు తెలిపారు.  అదే సమయంలో చిత్తూరు జిల్లా వాసులు అన్నదాతలకు జై అమరావతి అంటూ స్వాగతం పలికారు.  పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు ఈనెల 15, 16 తేదీల్లో శ్రీవారి దర్శనం కల్పించాలని అమరావతి ఐకాస ప్రతినిధులు తితిదే ను అభ్యర్ధించారు.   దాదాపు 500 మందికి శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు.   ఈనెల 17న సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని ఐకాస ప్రతినిధులు తెలిపారు.   అనుమతి ప్రకటిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యమకారులకు జగ్గరాజుపల్లె వద్ద తెలుగుదేశం నేతలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వాగతం పలికారు.

సభకు అనుమతిపై వెంటనే స్పందించండి :
ఈనెల 17న నిర్వహించబోయే సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని అమరావతి రైతుల ఐకాస నేతలు తెలిపారు.  త్వరగా నిర్ణయం తెలిపితే.. తదుపరి కార్యాచరణ అమలు చేస్తామని వివరించారు.  ఈనెల 17న అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించబోయే సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని ఐకాస నేతలు తెలిపారు.   పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాము సమాధానాలు పంపినట్లు వివరించారు.    చింతలపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఊరందూరు వరకు సాగనుంది.  శ్రీకాళహస్తిలో బస చేసేందుకు అన్నదాతలు ఏర్పాటు చేసుకోగా..వైకాపా నేతల ఒత్తిడితో కల్యాణమండపం నిర్వాహకులు వెనక్కి తగ్గారని వారు ఆరోపించారు.  అమరావతి రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 38వ రోజుకు చేరింది.

Related Posts