YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్షత్రియులను అవమానిస్తే సహించం

క్షత్రియులను అవమానిస్తే సహించం

ఏలూరు
క్షత్రియ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని టీడీపీ శాసనమండలి సభ్యుడు  మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు. ఈ మేరకు అయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు.  మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దు.  నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును పార్లమెంటు సాక్షిగా వైసీపీ అవమానించింది.    సమస్యను ఎత్తిచూపితే ఎదురుదాడికి దిగడం వైసిపి ప్రభుత్వంలో రివాజుగా మారింది.   వరదల అంశాన్ని పక్కదారి పట్టించడానికి గతనెల 19వతేదీన అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.   రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన వైసిపి నేతలు... ఇప్పుడు ఈ జాడ్యాన్ని పార్లమెంటుకు కూడా అంటించారు.   ఇది ఏ మాత్రం వాంఛనీయం కాదు.  రాజకీయంగా విధానాలపైనో, మరే ఇతర సమస్యలపైనో రఘురామకృష్ణంరాజును విమర్శిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు.  కానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం ఏమాత్రం క్షంతవ్యం కాదు.   అందరి మాదిరిగానే మా సామాజికవర్గానికి కూడా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది.    మా ఆత్మాభిమానం దెబ్బతీసేవిధంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం.   మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తగువిధంగా సమాధానం చెప్పగలమని హెచ్చరిస్తున్నాం.   పార్లమెంటు సాక్షిగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన వైసీపీ ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్జప్తి చేస్తున్నాం.   రఘురామ కృష్ణంరాజుకు ఏదైనా జరిగితే వైసీపీదే బాధ్యత అయన పేర్కోన్నారు..

Related Posts