YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

త్వరలో టీఆర్ఎస్ బస్సు యాత్ర

త్వరలో టీఆర్ఎస్ బస్సు యాత్ర

హైద్రాబాద్, డిసెంబర్  8,
ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించకపోతే చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా మూడు దశల్లో పోరాటం చేయాలని కూడా ఎంపీలకు సూచించినట్లు సమాచారం.ఈ పోరాటంలో భాగంగానే ఎంపీలతో బస్సు యాత్ర చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీలు ఎవరికి వారుగా తమ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బస్సు యాత్ర చేపడతారా? లేక కలిసికట్టుగా రాష్ట్రమంతా తిరుగుతారా? అనేదానిపై స్పష్టత రావడం లేదు. దీనిపైనా కేసీఆర్‌ ఆలోచన మేరకే ఎంపీలు నడుచుకుటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎంపీలు బుధ లేదా గురువారాల్లో కేసీఆర్‌ను కలిసి దీనిపై చర్చించనున్నారు. ఆ తర్వాతే ఎంపీల కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎంపీల్లో చాలామంది బస్సు యాత్రకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

Related Posts