YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం 100 సార్లు ప్రయత్నం

కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం 100 సార్లు ప్రయత్నం

హైదరాబాద్, డిసెంబర్ 8,
ఢిల్లీకి వెళ్తే ప్రధాని, కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారా? అని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తాను కేటీఆర్‌ అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటివరకు కనీసం 100సార్లు అయినా ప్రయత్నించానని, ఒక్కసారి కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కే ఆయన నేరుగా వాట్సాప్ మెసేజ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఎన్నోసార్లు అడిగా. వందసార్లకు పైగా ప్రయత్నించా. అయినా కలిసే అవకాశం ఇవ్వలేదు. మీ ఓఎస్‌డీకి సైతం ఎన్నోసార్లు విన్నపం చేసినా ఇంతవరకు సమాధానమివ్వలేదు’ అంటూ రాజాసింగ్‌ లోథ్‌ మంగళవారం మంత్రి కేటీఆర్‌కు బహిరంగంగా వాట్సప్‌లో సందేశం పంపించారు. ‘ఎంఐఎం ఎమ్మెల్యేల మాదిరిగా ప్రభుత్వ భూముల సెటిల్‌మెంట్ల కోసం తాను అపాయింట్‌మెంట్ కోరలేదని, తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి సమయం ఇవ్వాలని అడుగుతున్నానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తరహాలోనే కేటీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా తప్పించుకునే ధోరణిని అవలంబిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

Related Posts