YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ ద్వారా చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలేమిటి?

సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ ద్వారా చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలేమిటి?

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8
సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌(సీఆర్‌ఎఫ్‌)ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇతర అభివృద్ధి ప్రాజెక్ట్‌ల కోసం ఖర్చు చేస్తున్న విషయం వాస్తవమేనా? వాస్తవం అయితే 2021-22లో సీఆర్‌ఎఫ్‌ నిధులను వినియోగించి చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏవి? సీఆర్ఎఫ్ నుంచి ఎంత శాతం రోడ్లు, హైవేలు, జలమార్గాలు, ఇతర ప్రాజెక్ట్‌లకు కేటాయించాలన్న నిర్ణయం జరిగింది అని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి శ్రీ వీకే సింగ్‌ జవాబిస్తూ 2018లో జరిగిన సవరణ అనంతరం సీఆర్‌ఎఫ్‌ను సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌గా పేరు మార్చడం జరిగిందని చెప్పారు. సీఆర్‌ఐఎఫ్‌ పూర్తిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు.  సీఐర్‌ఐఎఫ్‌ నిధులను ఉపయోగించి చేపట్టే ఇన్‌ఫ్రా, అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు కేటాయింపులు, పర్యవేక్షణ ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోనే జరుగుతుందని చెప్పారు.

Related Posts