YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జనాభా గణనలో కులగణన చేయాలి పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన - మహా ధర్నా

జనాభా గణనలో కులగణన చేయాలి పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన  - మహా ధర్నా

జనాభా గణనలో కులగణన చేయాలి
పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన  - మహా ధర్నా
న్యూ ఢిల్లీ డిసెంబర్ 8
త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన - ధర్నా జరిపారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మంది బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో జరిగిన ఈ మహాధర్నాలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, మాజీ పార్లమెంటు సభ్యులు అజిత్ బాషా, దాసు సురేష్, గుజ్జ సత్యం, ఆళ్ళ రామకృష్ణ, కిరణ్ కర్రి వేణుమాధవ్, నీల వెంకటేష్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రదర్శననుద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ జనభా గణన పట్టిలకలో 35 కాలమ్స్ ఉన్నవి. ఇంకొక కాలం పెడితే నష్టమేమిటి ? ఒక్క రూపాయి అదనపు ఖర్చు లేకుండా దేశంలోని కులాల జనాభా వివరాలన్నీ వస్తాయి.  ఎందుకు BJP ప్రభుత్వం అంగీకరించడం లేదు. దేశంలోని 70 కోట్ల మంది బి.సి లకు అభివృద్ధి చేయకుండా భారతదేశం అగ్రదేశంగా తయారవుతుందా? ఎందుకింత బి.సి ల పట్ల కక్షా! వివక్షా కాదా?  ఇలా చేస్తే జాతీయ స్థాయిలో బి.సి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.జనాభా గణనలో కుల గణన ప్రజలకు కాదు -  కేంద్ర –రాష్ట్ర ప్రభుత్వాలకు  రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం అవసరం. కుల గణనతో ఒక్కొక్క కులం జనాభా హో పాటు సాంఘీక, ఆర్ధిక, రాజకీయ వివరాలు సేకరించి  అన్ని కులాలకు సామాజిక న్యాయం జరుగుతుంది. వారి వారి కులాలకు జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు లబిస్తాయి. జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించి వారి ఆర్ధికాభివృద్ధి కి చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది, బి.సి కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి ఒకే రకమైన సారుప్యత కలిగిన వారిని గుర్తించి గ్రూపులుగా వర్గీకరించి ప్రత్యేక అబివృద్ది చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.  ప్రభుత్వాలకు అబివృద్ది-సంక్షేమ పథకాలకు, రిజర్వేషన్ల అమలుకు అవసరం. ఒకసారి కులాల వారి జనాభా గణన చేస్తే గత 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ సాంఘిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం బయటకు వస్తుంది. ఎన్ని కులాలు ఉన్నాయి. ఎన్ని అంతరించాయి. అలాగే భారత స్వాతంత్ర ఫలాలు, ప్రజాస్వామ్య ఫలాలు ఏయే కులాలు ఎంత శాతం పొందుతున్నారని వాస్తవాలు బయటకు వస్తాయి. అభివృద్ధి చెందిన భారత దేశంలోని పారిశ్రామిక, ఆర్థిక, రాజకీయ ఫలాలు ఏ కులాలకు దక్కాయి. ఇంత వరకు అభివృద్ధి ఫలాలకు  నోచుకోని కులాలకు వారి, వారి వాటా కేటాయింపులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రణాళిక రూపకల్పన చేయడానికి వీలవుతుందన్నారు.ఇప్పటివరకు కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన బిసి కమిషన్లు కుల గణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. ఇక రాజ్యాంగబద్ధంగా 1953లో నియమించిన కాక కాలేల్కర్ కమిషన్, 1979లో నియమించిన మండల్ కమిషన్ జనాభా గణనలో కుల గణన  చేయాలని కేంద్రానికి సిఫారసు చేశాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో నియమించిన ప్రతి బీసీ కమిషన్ అలాగే మొత్తం  దేశంలోని వివిధ రాష్ట్రాలలో నియమించిన 246 బీసీ కమిషన్లు కుల గణన చేయాలని సిఫార్సు చేశాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ససేమీరా అంటుంది.ఇక ఉన్నత న్యాయస్థానాలు విషయానికొస్తే సుప్రీంకోర్టు – హైకోర్టులు రిజర్వేషన్ల కేసులు వచ్చిన ప్రతిసారి కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేశాయి. కానీ వాటికి చట్టబద్ధత - న్యాయబద్ధత ఉండదు. కేవలం “సెన్సస్ శాఖ” వారు చేసిన దానికి చట్ట బద్దత ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. బీసీ కమిషన్లు - సుప్రీం కోర్టు – హైకోర్టులు -రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు కులగణన చేయాలని కోరుకుంటే  ఎందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది.

Related Posts